పెళ్లి పీటలెక్కుతోంటే!

జీవితంలో అతి ముఖ్య వేడుక పెళ్లి. అలాంటి ప్రత్యేక రోజున మెరిసిపోవాలిగా మరి! ఒకటి, రెండు నెలల సమయం ఉందంటే సహజ పదార్థాలతోనే ప్రయత్నించండి...

Updated : 13 Jan 2022 06:34 IST

జీవితంలో అతి ముఖ్య వేడుక పెళ్లి. అలాంటి ప్రత్యేక రోజున మెరిసిపోవాలిగా మరి! ఒకటి, రెండు నెలల సమయం ఉందంటే సహజ పదార్థాలతోనే ప్రయత్నించండి...

బాదంపప్పు 125 గ్రా., నల్లజీలకర్ర 50 గ్రా.,  పచ్చి పసుపు 25 గ్రా., ఎర్రకందిపప్పు 250 గ్రా., శనగపిండి 250 గ్రా., గోధుమపిండి అరకప్పు చొప్పున తీసుకుని మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. దీన్ని పొడి గాజు సీసాలోకి తీసుకుంటే రెండు నెలలపాటు పాడవదు. స్నానం చేసే ముందు ఓ గిన్నెలో నాలుగైదు చెంచాల ఈ పొడిని తీసుకుని తగినంత పెరుగు/ పచ్చిపాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని శరీరమంతా పట్టించాలి. తడిపొడిగా ఉన్నప్పుడే మృదువుగా రుద్దాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే సరి. వారానికి 3, 4 సార్లు చేస్తే, మృత కణాలు పోయి చర్మం మృదువుగా అవుతుంది. శరీరానికి రక్తప్రసరణ బాగా జరిగి కాంతి వస్తుంది.
సమయం లేదనుకుంటే.. రెండు చెంచాల పొడికి కాస్తంత తేనె, నిమ్మరసం, పాలు కలిపి ముఖానికి లేపనంలా రాసి పదినిమిషాలు వదిలేయాలి. ఆరాక కడిగినా మెరిసే ముఖం మీ సొంతమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్