గాలిపటం... జీవన పాఠం

పిల్లలు తేలిగ్గా తయారు చేసుకోగలిగే ఆట వస్తువుల్లో గాలిపటాలు ఒకటి. పాత పేపరు, నాలుగు కొబ్బరి పుల్లలు, కొద్దిపాటి దారం ఉంటే చాలు. నిమిషంలో గాలిపటం తయారు చేసుకోవచ్చు. ఇందులో మీరూ పాలు పంచుకోండి. దీనివల్ల చాలా లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Published : 15 Jan 2022 01:50 IST

పిల్లలు తేలిగ్గా తయారు చేసుకోగలిగే ఆట వస్తువుల్లో గాలిపటాలు ఒకటి. పాత పేపరు, నాలుగు కొబ్బరి పుల్లలు, కొద్దిపాటి దారం ఉంటే చాలు. నిమిషంలో గాలిపటం తయారు చేసుకోవచ్చు. ఇందులో మీరూ పాలు పంచుకోండి. దీనివల్ల చాలా లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

పరిష్కార నైపుణ్యాలు.. గాలిపటం తయారీ పిల్లలకి ఓ పనిని పూర్తి చేయడానికి ఎంత సహనం, శ్రద్ధ అవసరమో తెలియచేస్తుంది. చూడ్డానికి ఇది చాలా తేలిగ్గా అనిపించినా దాంట్లోనూ కొన్ని సమస్యలు ఉంటాయి. అంతా చేశాక దారం పొడవు సరిపోలేదనో, తోక సరిగా రాలేదనో అనిపిస్తుంది. దాంతో సరిగ్గా ఎగరదు. అప్పుడు మళ్లీ సరిచేయాలి. ఇలాంటివన్నీ ఒక పనిని పూర్తి చేసే క్రమంలో సమస్యలను ఎలా గుర్తించాలి? ఎలా పరిష్కరించాలి అన్నవి పిల్లలకు నేర్పుతాయి.

మరచిపోలేని అనుభవం.. గాలిపటం ఎగుర వేయడం పిల్లలకి సంతోషకరమైన అనుభవాల్లో ఒకటి. సొంతంగా చేసిన ఒక బొమ్మ ఆకాశంలో రివ్వున ఎగురుతుండగా వారి మొహాలు చూడండి... ఓ గర్వం, ఓ ఆనందం తాండవిస్తూ ఉంటాయి. చాకచక్యంగా ఎగురవేయడం, ఇతరులతో పోటీ... ఇవన్నీ ఉత్కంఠ కలిగిస్తాయి. చిన్నారులు తప్పక రుచి చూడాల్సిన అనుభూతి ఇది.

బలపడే బంధాలు.. అమ్మానాన్నలతోనో, అన్నా చెల్లెళ్లతోనో కలిసి గాలిపటం తయారు చేయడం, దారానికి మాంజా రాయడం, అది ఆరాక చుట్లు చుట్టి, అందరూ కలిసి ఎగురవేయడం అద్భుతమైన కాలక్షేపం. పిల్లలు గాలి పటం తయారు చేసేటప్పుడు వారి సృజనకు హద్దులుండవు. బృంద స్ఫూర్తిని అలవరుస్తుంది.

ఆరోగ్యం..  అది గాల్లో దూసుకుపోతూంటే, చేతిలోని దారంతో దాన్ని నియంత్రిస్తూ... ఆ సమయంలో మీకింకేమీ గుర్తుకురావు. గాలిపటం ఎగుర వేసేటప్పుడు జ్ఞాపకశక్తి, అభ్యాసం, భావోద్వేగాలపై ప్రభావం చూపే మెదడులోని కొన్ని భాగాలను ప్రేరేపితమవుతాయని పరిశోధనల్లో తేలింది. కాబట్టి పిల్లలతో కలసి మీరూ ఈ సంక్రాంతికి గాలిపటాలు తయారు చేయండి... ఎగరేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్