వేతనం ఒక్కటేనా.. లెక్కలోకి!

మంచి వేతనం లభిస్తోందంటే వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోవాలని అనుకునేవారు ఎంతోమంది! అయితే, ఉద్యోగం మారే ముందు పెరిగే వేతనాన్ని మాత్రమే చూడకూడదని కెరీర్‌ నిపుణులు అంటున్నారు. కొన్ని ముఖ్య అంశాలపై ప్రశ్నలు వేసుకుని, సంతృప్తికరమైన సమాధానాలొస్తేనే నిర్ణయం తీసుకోవడం మంచిదంటున్నారు...

Published : 17 Jan 2022 00:21 IST

మంచి వేతనం లభిస్తోందంటే వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోవాలని అనుకునేవారు ఎంతోమంది! అయితే, ఉద్యోగం మారే ముందు పెరిగే వేతనాన్ని మాత్రమే చూడకూడదని కెరీర్‌ నిపుణులు అంటున్నారు. కొన్ని ముఖ్య అంశాలపై ప్రశ్నలు వేసుకుని, సంతృప్తికరమైన సమాధానాలొస్తేనే నిర్ణయం తీసుకోవడం మంచిదంటున్నారు.

విధానాలేంటి? కార్పొరేట్‌ సంస్థల స్థాయిని బట్టి వాటి విధివిధానాలు భిన్నంగా ఉంటాయి. మీ వ్యక్తిత్వానికీ, పనితీరుకీ.. అలాగే అనువైన పనివేళలూ, వాతావరణం ఉన్నాయా  అని పరిశీలించుకోవాలి.

నేర్చుకునే వీలుందా? కొత్త ఉద్యోగం వృత్తిపరమైన భవిష్యత్తుకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? మీ నైపుణ్యాలను మెరుగుపర్చే విధంగానే ఉందా? మరేదైనా ప్రత్యేక శిక్షణ తీసుకోవాల్సి ఉంటుందా? లాంటి విషయాలను గమనించాలి.

గుర్తింపు మాటేంటి? ఇది లేకపోతే ఎంత కష్టపడ్డా వృథానే. అందుకే, మీరు చేరబోయే ఉద్యోగానికి, మీ నైపుణ్యానికి గుర్తింపు లభిస్తుందో లేదో పరిశీలించండి.   సంస్థ ఎక్కడుంది? ఉద్యోగం మారే ముందు ప్రయాణం, జీవన వ్యయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వేరే ఉద్యోగంలో చేరితే ఆ సంస్థ ఎంత దూరంలో ఉంది? ప్రయాణ ఖర్చులు కంపెనీ భరిస్తుందా.. జీవనవ్యయం ఏ విధంగా ఉందో పరిశీలించాలి.

వేతనం ఒక్కటేనా? ఉద్యోగులకు సంస్థలు వేతనంతోపాటు అదనంగా జీవిత, ఆరోగ్య బీమా, బోనస్‌లు అందిస్తుంటాయి. ఆ వివరాలు తెలుసుకోవాలి. ప్రసవ సెలవులు, చిన్నారుల సంరక్షణ కేంద్రం ఆయా సంస్థల్లో ఉన్నాయో లేవో కనుక్కోవాలి.

అనుకూలమైన పనివేళలున్నాయా?  ఇంటి బాధ్యతల్ని సమన్వయం చేసుకుంటూ ఉద్యోగ విధులు నిర్వర్తించే వీలుండటమూ పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయమే. పని బాధ్యత మనదే. ఇదే లెక్కన... అవసరాన్ని బట్టి ఇంటి నుంచి పని చేసేందుకు అనుమతిస్తారా అన్నది అడిగి తెలుసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్