ఇలా గెలుద్దాం..

మహిళలు కెరియర్‌లో ముందుకెళ్లాలంటే సొంత గుర్తింపుని సాధించాలి. ప్రత్యేక నైపుణ్యాలతో వ్యక్తిగత బ్రాండ్‌, పేరు సంపాదిస్తే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అనుకోనిది జరిగి ఉద్యోగం మారాలన్నా.. మరోటి రావడానికి ఈ గుర్తింపు దోహదపడుతుంది.

Published : 19 Jan 2022 01:13 IST

హిళలు కెరియర్‌లో ముందుకెళ్లాలంటే సొంత గుర్తింపుని సాధించాలి. ప్రత్యేక నైపుణ్యాలతో వ్యక్తిగత బ్రాండ్‌, పేరు సంపాదిస్తే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అనుకోనిది జరిగి ఉద్యోగం మారాలన్నా.. మరోటి రావడానికి ఈ గుర్తింపు దోహదపడుతుంది. బ్రాండ్‌ ప్రచార బాధ్యతా మనదే. చాలా మంది ఈ విషయంలో ఇబ్బంది పడతారు. కానీ కొన్నిసార్లు సెల్ఫ్‌ ప్రమోషన్‌ కూడా చాలా అవసరం.

మన పనితీరుపై ఇతరుల అభిప్రాయాలను తెలుసుకున్నప్పుడే లోపాలను సరిదిద్దుకుని నైపుణ్యాలను మెరుగుపర్చుకోగలం. లక్ష్యసాధనలోనూ ఇది సహాయ పడుతుంది. ఎదిగే అవకాశాలను దెబ్బతీసే వదంతుల నుంచీ రక్షిస్తుంది. మనం ఎంత ఆత్మవిశ్వాసం, సమర్థతతో కన్పిస్తామో, ఇతరులు కూడా మన సామర్థ్యాలపై అంత నమ్మకంగా ఉండగలరు. ఈ విషయంలో సూటిగా, స్పష్టంగా ఉండాలి. మనకేది కావాలో.. ఏది అవసరమో వాటిని అడిగే ధైర్యం ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని