స్నేహితురాలుంటే కష్టం తీరినట్టే!

పెద్దా, చిన్నా అని లేకుండా ఇప్పుడు దాదాపుగా అందరినీ బాధిస్తున్న సమస్య ఒత్తిడి. దీనిని అదుపులో ఉంచడం ఎలా అన్న అంశంపై ఇల్లినాయిస్‌ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనల్లో భాగంగా మహిళలు

Updated : 25 Jan 2022 04:41 IST

పెద్దా, చిన్నా అని లేకుండా ఇప్పుడు దాదాపుగా అందరినీ బాధిస్తున్న సమస్య ఒత్తిడి. దీనిని అదుపులో ఉంచడం ఎలా అన్న అంశంపై ఇల్లినాయిస్‌ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనల్లో భాగంగా మహిళలు తమ ఒత్తిడిని అదుపులో ఉంచుకునే విధానం శాస్త్రవేత్తల్ని బాగా ఆకర్షించిందట. అదేంటో తెలుసా? మహిళలు తమకే కష్టం వచ్చినా మగవాళ్ల మాదిరిగా కోప్పడ్డమో, మనసులోనే ఉంచుకుని కుంగిపోవడమో చేయరట. తమకు బాగా దగ్గరగా ఉండే ఓ స్నేహితురాలితో ఈ విషయాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తారట. ఇలా స్నేహితురాలితో పంచుకోవడం వల్ల ఒత్తిడి ఎదురయినప్పుడు విడుదలయ్యే కార్టిసాల్‌ స్థాయిలు అదుపులో ఉంటున్నాయని తేలింది. అయితే మగవాళ్లలో కూడా ఎక్కువమంది స్నేహితులు ఉన్నవారిలో ఆక్సిటోసిన్‌ అనే ఒత్తిడి నియంత్రణ హార్మోన్‌ విడుదల అవుతుందట. మొత్తం మీద ఓ మంచి స్నేహితురాలు, లేదా స్నేహితుడు వల్ల ఒత్తిడి అదుపులో ఉంటుందని తేలింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్