కురులకీ డిటాక్స్‌!

చర్మం, శరీరానికే కాదు.. మన కేశాలకీ డిటాక్స్‌ కావాలి. మనం వాడే ఉత్పత్తులు, వాటిలోని రసాయనాలు కురులపై అలాగే ఉండిపోతాయట. కాలానికి అనుగుణంగా వాటిని బయటకు పంపేయాలి.

Updated : 28 Jan 2022 05:18 IST

చర్మం, శరీరానికే కాదు.. మన కేశాలకీ డిటాక్స్‌ కావాలి. మనం వాడే ఉత్పత్తులు, వాటిలోని రసాయనాలు కురులపై అలాగే ఉండిపోతాయట. కాలానికి అనుగుణంగా వాటిని బయటకు పంపేయాలి. అందుకు తోడ్పడే మార్గమిదీ!

* మృతకణాలను పోగొట్టడానికి చర్మానికి ఎక్స్‌ఫోలియేషన్‌ చేస్తాం కదా! మాడుకీ ఇది తప్పనిసరి. స్కాల్ప్‌ స్క్రబ్‌లు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. ఇవి మాడుపైనున్న మృతకణాలు, జిడ్డు, చుండ్రు, మురికి వంటివాటిని తొలగిస్తాయి. తద్వారా కురులు ఆరోగ్యంగా పెరగడమే కాకుండా మృదువుగానూ తయారవుతాయి.

* ముఖానికి ఎంచిమరీ ఉత్పత్తులను కొంటాం. కురుల విషయంలోనూ ఇదే విధానాన్ని పాటించాలి. రసాయనాలతో కూడిన వాటికి దూరంగా ఉండండి. బదులుగా అలోవెరా, ఆపిల్‌ సిడార్‌ వెనిగర్‌ వంటివి ఉన్నవాటిని ఎంచుకోండి. ఒత్తయిన కురులు మీ సొంతమవుతాయి.

* మాడుకీ తేమ కావాలి. వారంలో కనీసం రెండుసార్లు నూనె రాయడమో, హెయిర్‌ మాస్క్‌లను పట్టించడమో చేయాలి. పెరుగుదల బాగా ఉండాలంటే కత్తెర పడాల్సిందే. అప్పుడప్పుడూ జుట్టు చివర్లను కత్తిరించండి. చిట్లడం, ఎండిపోయినట్లుగా కనిపించడం వంటివి ఉండవు. మెరుగైన ఫలితాలకు కేశాల చివర్లను కత్తిరించాకే డీటాక్స్‌ను ప్రారంభించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్