సీరమ్‌.. ప్రయత్నిస్తున్నారా?

మెరుపునివ్వడంతోపాటు వృద్ధాప్య ఛాయల్ని దూరం చేయడం వరకు.. సీరమ్‌ వల్ల ప్రయోజనాలెన్నో. అందుకే దీన్ని రోజువారీ చర్మ సంరక్షణ ప్రక్రియలో తప్పక భాగం చేసుకోమంటున్నారు నిపుణులు..

Updated : 29 Jan 2022 05:08 IST

మెరుపునివ్వడంతోపాటు వృద్ధాప్య ఛాయల్ని దూరం చేయడం వరకు.. సీరమ్‌ వల్ల ప్రయోజనాలెన్నో. అందుకే దీన్ని రోజువారీ చర్మ సంరక్షణ ప్రక్రియలో తప్పక భాగం చేసుకోమంటున్నారు నిపుణులు..
* విటమిన్‌ సి: వృద్ధాప్య ఛాయల్ని దూరంగా ఉంచుతుంది. ముప్పైఏళ్లు దాటినవాళ్లలో కొలాజెన్‌ స్థాయులను పెంచడమేకాక మెరుపునీ ఇస్తుంది.
* హ్యాలురోనిక్‌ ఆసిడ్‌: చర్మాన్ని హైడ్రేట్‌ చేస్తుంది. దీనిలో ఉండే సెరమైడ్స్‌, అమైనో ఆసిడ్లు చర్మం సహజంగా, మృదువుగా కనిపించేలా చేస్తాయి.
* యాంటీ ఆక్సిడెంట్లు: చర్మానికీ ఒత్తిడి ఉంటుంది. కాలుష్యం కారణంగా దెబ్బతింటుంది. వీటి నుంచి రక్షించడానికి చర్మానికి బీటా కెరొటిన్‌, గ్రీన్‌టీ, బెర్రీలు, దానిమ్మ, ద్రాక్ష గింజల సమ్మేళనాలను అందించాల్సి ఉంటుంది. వాటి గుణాలన్నీ ఈ సీరమ్‌ ద్వారా అందుతాయి.
* రెటినాల్స్‌: కొందరికి ముప్పయ్యో పడిలోకి వస్తున్నా.. మొటిమలు, దద్దుర్లు వదలవు. కాలుష్యం కారణంగా పాతికేళ్లకే ముఖంపై ముడతలు వస్తున్నాయి. అలాంటివారు రెటినాల్‌ గుణాలున్నదాన్ని ఎంచుకోవాలి.
* ప్లాంట్‌ బేస్‌డ్‌: దీనిలో లికోరైస్‌ వంటి గుణాలుంటాయి. చర్మం నిర్జీవంగా ఉండేవారికి ఇది ఉత్తమ ఎంపిక. ముఖంపై ఎండ, మొటిమల కారణంగా ఏర్పడిన మచ్చలను తొలగించడమే కాక మెరుపునీ అందిస్తుంది.
* యాంటీ ఇన్‌ఫ్లమేటరీ: సున్నితమైన చర్మమున్నవారు దీన్ని ఎంచుకోవచ్చు. అలొవెరా, ఆర్నికా, జింక్‌ వంటి గుణాలతో తయారు చేస్తారు. చర్మాన్ని నునుపుగా చేయడమే కాకుండా మొటిమలు, ఎర్రదనం వంటివి రాకుండా కూడా ఆపుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్