పని.. ఆహ్లాదంగా!

మూడో ఉద్ధృతి మొదలైందో లేదో.. మళ్లీ పని ఇంటికే పరిమితమైంది. అలా తెరుచున్న కార్యాయాలూ తిరిగి వర్క్‌ ఫ్రమ్‌ హోం బాట పట్టాయి. ఒంటరి పనితో ఒత్తిడిగా భావించిన వాళ్లకి ఇదో శిక్షలాంటిదే! దాన్నుంచి తప్పించుకోవాలంటే..

Updated : 29 Jan 2022 05:24 IST

మూడో ఉద్ధృతి మొదలైందో లేదో.. మళ్లీ పని ఇంటికే పరిమితమైంది. అలా తెరుచున్న కార్యాయాలూ తిరిగి వర్క్‌ ఫ్రమ్‌ హోం బాట పట్టాయి. ఒంటరి పనితో ఒత్తిడిగా భావించిన వాళ్లకి ఇదో శిక్షలాంటిదే! దాన్నుంచి తప్పించుకోవాలంటే..
* ఇంట్లో ఉన్నామనిపిస్తే కదా.. ఒంటరి భావన కలిగేది. పని వాతావరణాన్ని కల్పించుకోండి. అంటే.. మంచాలు, సోఫాల్లో కాకుండా ప్రత్యేకంగా టేబుల్‌ ఏర్పాటు చేసుకోండి. అది గోడకు ఆనేలా ఉంటే మంచిది. అవసరమైతే ఓ టేబుల్‌ ల్యాంప్‌ని ఏర్పాటు చేసుకోండి. కానీ.. టేబుల్‌ వస్తువులతో నిండిపోవద్దు అనుకునేవాళ్లకు మాత్రం ఇది ఇబ్బంది అవొచ్చు. మరీ అవసరమైతే తప్ప దాని జోలికి వెళ్లకండి.
* కళ్లకు హాయినిచ్చే రంగులను గోడకు వేయండి. చిన్నమార్పే కానీ మనసుపై బలమైన ముద్ర పడేలా చేయగలదు. అవసరమైన వస్తువులన్నింటినీ చక్కగా, తేలిగ్గా దొరికేలా సర్ది పెట్టుకోండి. సగం విసుగు తగ్గుతుంది.
* వీలైనంత వరకూ సహజ వెలుతురు వచ్చేలా చూసుకోండి. కిటికీకి దగ్గర్లో, పచ్చదనం, మొక్కలు కనిపించేలా ఏర్పాటు చేసుకుంటే ఇంకా మంచిది. అవకాశం లేదూ.. టేబుల్‌ మీద చిన్న గాజు సీసాలో మనీ ప్లాంట్‌ను పెట్టుకోండి. చూడగానే మీ పెదవులపై చిరనవ్వును తెచ్చే ఒక ఫొటోనో చిన్న సందేశమున్నదో ఎదురుగా పెట్టుకుంటే సరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్