కంప్యూటర్‌ నైపుణ్యాలున్నాయా?

ఈ తరం గ్రాడ్యుయేట్లకు కోర్సులో భాగంగా బలమైన ఐటీ నైపుణ్యాలు ఉండాలని సంస్థలు ఆశిస్తున్నాయి. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు టెక్నాలజీ పరంగా తక్కువ ఆసక్తి కనబరుస్తారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అది కెరియర్‌లో వెనకబడేలా చేయొచ్చు.

Updated : 01 Feb 2022 04:47 IST

ఈ తరం గ్రాడ్యుయేట్లకు కోర్సులో భాగంగా బలమైన ఐటీ నైపుణ్యాలు ఉండాలని సంస్థలు ఆశిస్తున్నాయి. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు టెక్నాలజీ పరంగా తక్కువ ఆసక్తి కనబరుస్తారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అది కెరియర్‌లో వెనకబడేలా చేయొచ్చు. కాబట్టి కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి.

విద్యానేపథ్యం మేథ్స్‌, సైన్స్‌, ఆర్ట్స్‌.. ఎంచుకున్నదేదైనా, పనిచేయబోయే రంగంతో సంబంధం లేకుండా కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి. కాబట్టి, అమ్మాయిలు గ్రాడ్యుయేషన్‌ దశలోనే వీటిపై దృష్టిపెట్టాలి. వాటిని చెప్పే విధానమూ ఇక్కడ ప్రధానమే. చాలావరకూ రెజ్యూమెలో కంప్యూటర్‌ స్కిల్స్‌.. అని చెప్పి ప్రాథమిక నైపుణ్యాల జాబితాను రాసేస్తుంటారు. అలాకాకుండా ఉదాహరణలతో చెబితే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది. ఉదాహరణకు- ‘ఫలానా ప్రాజెక్టు చేస్తున్నప్పుడు సమస్య ఎదురైంది. దాన్ని పరిష్కరించడంలో భాగంగా సాఫ్ట్‌వేర్‌/ యాప్‌ను ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నా’.. ఇలా రాసుకోవచ్చు. కంప్యూటర్‌, ఐటీ నైపుణ్యాల్లో ఏ అంశాలైైనా తెలియనపుడు నేర్చుకోవడానికి ఆసక్తి చూపడం మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతుంది. ఇది మీలోని కొత్తదనాన్ని స్వాగతించే తీరును బయటపెడుతుంది. సంస్థలు ఇలాంటివాళ్లకే ప్రాధాన్యమిస్తాయి కూడా.

అలా కాకుండా.. ‘స్నేహితులతో చాట్‌ చేయడానికీ లేదా నా స్నేహితులను చూసి నేనూ ప్రయత్నించా’ వంటి సమాధానాలను చెప్పకూడదు. మీ కంప్యూటర్‌ ప్రాథమిక అవసరం సోషల్‌ మీడియా కోసమే అన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చినవారవుతారు. అది మీపై ప్రతికూల అభిప్రాయాన్నీ ఏర్పరుస్తుంది. రెజ్యూమెలోనూ ఆసక్తుల్లో సోషలైజింగ్‌ వంటివి చేర్చొద్దు. వీటిని మెరుగుపరచుకోవడానికి బ్లాగును రూపొందించుకోవడం, వెబ్‌సైట్‌, ప్రోగ్రామ్‌ లాంగ్వేజీలకు సంబంధించిన ప్రాథమికాంశాలను నేర్చుకోవడం వంటివి చేయొచ్చు. వెబ్‌లాగ్స్‌నూ ప్రయత్నించొచ్చు. మీరెంచుకున్న అంశాన్నిబట్టి వ్యాపార సంబంధ అవగాహనకూ ఇవి తోడ్పడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్