ప్రొఫైల్‌లో ఇవి గమనించారా
కొంచెం అందమైన ఫొటో ఉంచినా.. సృజనాత్మక చూపించినా.. సామాజిక మాధ్యమాల్లో అమ్మాయిల ఖాతాలకు ఫ్రెండ్ రిక్వెస్టులు, అనుసరించేవారి సంఖ్య పెరుగుతుంటాయి. వారిలో కొందరి ప్రవర్తన నచ్చి మాటా కలుపుతుంటారు. మరి ఆ స్నేహహస్తం సరైనదేనా? గమనించుకోండిలా..!
కొంచెం అందమైన ఫొటో ఉంచినా.. సృజనాత్మక చూపించినా.. సామాజిక మాధ్యమాల్లో అమ్మాయిల ఖాతాలకు ఫ్రెండ్ రిక్వెస్టులు, అనుసరించేవారి సంఖ్య పెరుగుతుంటాయి. వారిలో కొందరి ప్రవర్తన నచ్చి మాటా కలుపుతుంటారు. మరి ఆ స్నేహహస్తం సరైనదేనా? గమనించుకోండిలా..!
నిజాయతీతో కూడిన వాళ్లే స్నేహితులవుతారని ఊహించలేం. కాబట్టి, భవిష్యత్ ప్రమాదాల నుంచి తప్పించుకోవాలంటే కొంత జాగ్రత్తతో ఉండటం మంచిదే. రిక్వెస్ట్/ మెసేజ్ పంపిన వారిని వెంటనే జోడించుకుంటూ వెళ్లకండి. వాళ్ల ప్రొఫైల్‌ని గమనించండి. కేవలం పేరు, ఫొటోలే ఉన్నాయా.. సంబంధిత వివరాలేమైనా ఉన్నాయా పరిశీలించండి. సొంత ఖాతాని ఎవరైనా.. అందంగా, ఆకర్షణీయంగా ఉండేలా చూసుకుంటారు. అలా కాకుండా అతి తక్కువ వివరాలున్నాయంటే అనుమానించాల్సిందే. అలాగే ఎన్ని రోజులుగా వాడుతున్నారు, అనుసరిస్తున్న వారి సంఖ్య, స్నేహితుల వివరాలనూ గమనించుకోవాలి.
సామాజిక మాధ్యమాలన్నాక ఫొటోలను షేర్ చేయడం మామూలే. ఖాతాకి ఉన్న ఫొటో మినహా వేరేవేవీ లేకపోయినా నకలుగా భావించండి. సరే.. చాలామందికి వ్యక్తిగత ఫొటోలుంచడం నచ్చదు. కానీ వేరే అంశాలపైనా ఆసక్తి లేకుండా ఉండదు కదా! అలా లేకపోతే అసలు ఖాతానే అనవసరం. కాబట్టి, దీన్నీ పరిగణనలోకి తీసుకోండి.
తమ గురించి తాము గొప్పలు చెప్పుకోవడం.. సంభాషణలన్నీ హోదా చుట్టూ, ఖరీదైన విషయాల చుట్టూనే తిరుగుతున్నా.. వాళ్లేదో దాయాలని చూస్తున్నట్లే. నిజమైన స్నేహం కావాలని చాలామందికి ఉంటుంది. కానీ తగినవాళ్లని ఎంచుకోవడమే ముఖ్యం. ఆన్లైన్ స్నేహాలు అనుకున్నంత ఆరోగ్యకరం కాకపోవచ్చు. కాబట్టి, వ్యక్తిగత వివరాలు, ఫొటోలు వంటివి పంచుకోకండి. ముఖ్యంగా మనసు అందిస్తున్న సంకేతాలను గమనించుకోండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- మండే ఎండల్లో.. డీహైడ్రేషన్‌కి గురి కాకుండా..!
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
అనుబంధం
- దాంపత్య బంధాన్ని పెంచే ‘1-1-1-1 రూల్’!
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- అతను తగినవాడేనా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
యూత్ కార్నర్
- రూమ్మేట్తో గొడవలు రాకుండా..!
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- అందుకే వీళ్ల ఎంగేజ్మెంట్ రింగ్స్.. ఎంతో స్పెషల్!
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...