వీరితో జాగ్రత్త!
కార్యాలయంలో రకరకాల సహోద్యోగులతో కలిసి పనిచేయాల్సి వస్తుంది. కొందరు తోటివారికి సాయం చేస్తే... మరికొందరు వృత్తిపరంగా గట్టి పోటీ ఇస్తారు. ఈ రెండు రకాల వారితో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మూడో రకం వ్యక్తులుంటారు. వారితో చాలా ప్రమాదం.
కార్యాలయంలో రకరకాల సహోద్యోగులతో కలిసి పనిచేయాల్సి వస్తుంది. కొందరు తోటివారికి సాయం చేస్తే... మరికొందరు వృత్తిపరంగా గట్టి పోటీ ఇస్తారు. ఈ రెండు రకాల వారితో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మూడో రకం వ్యక్తులుంటారు. వారితో చాలా ప్రమాదం. వాళ్లు ఎలా ఉంటారో.... వారి నుంచి ఎలా తప్పించుకోవాలో చూద్దామా...
* కొందరు సహోద్యోగులు అవకాశం వచ్చినప్పుడు మీరు చేసిన కష్టానికి ఫలితాన్ని వారు కొట్టేస్తారు. ఉదాహరణకు మీ పై అధికారి మీకో ప్రాజెక్ట్ అప్పజెప్పారు. మీరంతా పూర్తి చేసి చివర్లో మీ సహోద్యోగి సాయం తీసుకున్నారనుకోండి. ఆ పని తన వల్లే పూర్తయ్యిందని పైస్థాయి వాళ్లకి చెబుతారు.
* కార్యాలయాల్లో పుకార్లు షికార్లు చేయడం సాధారణమే. ఎవరైనా ఇతరుల గురించి మీ ముందు చెడుగా చెబుతోంటే వారి మాటలను పట్టించుకోవద్దు. ఎందుకంటే ఆ వ్యక్తి మీ గురించి కూడా ఇతరుల వద్ద ఇదేవిధంగా మాట్లాడే అవకాశం ఉంది.
* మరికొందరికి అహం కాస్త ఎక్కువగానే ఉంటుంది. అదే తమకు ఆభరణమనుకుంటారు. ఎప్పుడూ ఎదుటివారిని కించపరిచేలా మాట్లాడటం, చులకనగా చూడటం వీరికి అలవాటు. ఇతరులంటే చిన్నచూపు. ఇలాంటి వారితోనూ జాగ్రత్తగా మెలగాలి. వారి మాటలను పట్టించుకుని ఆత్మన్యూనతకు గురికావొద్దు.
* మీతో సఖ్యంగా ఉంటూ మీ ఆలోచనలు, ఉపాయాలను కాజేసి బాస్ దగ్గర మెప్పు పొందుతుంటారు. ఇలాంటివారితో వీలైనంత దూరంగా ఉండాలి.
* చివరి రకం... సోమరి ఉద్యోగులు... వీరు సరిగా పనిచేయరు. తమ పనిని ఇతరులపై రుద్ది హాయిగా కాలాన్ని వృథా చేస్తారు. ఇలాంటి వారితో మొదట్లోనే నిక్కచ్చిగా ఉండటం అలవాటు చేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
- గడువు దాటితే వద్దు...
ఆరోగ్యమస్తు
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!
- తేలిగ్గా తీసుకోవద్దు!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
- వ్యాయామం చేయలేకపోతున్నారా?
అనుబంధం
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
- పిల్లలకీ కావాలో రొటీన్!
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
- వాచీ రింగు పూల హంగు!
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!