మాయిశ్చరైజర్‌ రాస్తున్నారా?

చలికాలపు సమస్యల్లో చర్మం పొడిబారిపోవడం  ఒకటి. దాన్ని నిర్లక్ష్యం చేస్తే తెల్లగా పొడల్లా అందవికారంగా కనిపిస్తుంది. అప్పటికీ పట్టించుకోకపోతే పగిలిపోయినట్టు ఉంటుంది. అలా కాకుండా

Updated : 07 Feb 2022 16:22 IST

చలికాలపు సమస్యల్లో చర్మం పొడిబారిపోవడం  ఒకటి. దాన్ని నిర్లక్ష్యం చేస్తే తెల్లగా పొడల్లా అందవికారంగా కనిపిస్తుంది. అప్పటికీ పట్టించుకోకపోతే పగిలిపోయినట్టు ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే..

* స్నానం చేయగానే చర్మానికి మాయిశ్చరైజర్‌ రాస్తే చర్మం పొడిబారదు, మృదువుగా ఉంటుంది. మంట, దురద లాంటి చర్మ సమస్యలు తలెత్తవు. చర్మానికి కాంతి వస్తుంది. ఎండ వేడిమి నుంచి కాపాడుతుంది. ముడతలను నివారించి వృద్ధాప్య ఛాయలు దూరం చేస్తుంది. సున్నిత చర్మానికి రక్షణగా నిలుస్తుంది.

* వేడినీళ్లతో తలస్నానం చేసివచ్చాక ఒంటికి మాయిశ్చరైజర్‌ పట్టించండి.. ఎంతో తాజాదనం అనుభూతికొస్తుంది. దీన్ని ముఖానికి, చేతులకు కింది నుంచి పైకి రాయాలి. గట్టిగా రుద్దొద్దు, లేదా రాసిన చర్మాన్ని పట్టి లాగొద్దు. ఇది రాసిన తర్వాత ఫౌండేషన్‌ క్రీమ్‌ రాస్తే మేకప్‌ ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది.

* కొబ్బరి నూనె, తేనె, ఆలివ్‌ నూనె, వెన్న, కలబంద గుజ్జు, అవకాడొ నూనె, పొద్దుతిరుగుడు గింజల నూనె, బాదం నూనె, దోసకాయ గుజ్జు, పెరుగు, ఆముదం, రోజ్‌ వాటర్‌... వీటిల్లో దేనినయినా  సహజ మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్