లక్ష్య సాధన మీదే గురి!

పనిచేసే చోట మీరు అనుకున్న లక్ష్యం సాధించాలంటే నిరంతర సాధన తప్పనిసరి. అందుకోసం మిమ్మల్ని మీరు ప్రతీ క్షణం ప్రోత్సహించుకోవాలి..

Published : 07 Feb 2022 00:12 IST

పనిచేసే చోట మీరు అనుకున్న లక్ష్యం సాధించాలంటే నిరంతర సాధన తప్పనిసరి. అందుకోసం మిమ్మల్ని మీరు ప్రతీ క్షణం ప్రోత్సహించుకోవాలి..

* మీరు ఏయే లక్ష్యాలను పూర్తి చేయాలనుకుంటున్నారో అనే విషయాన్ని ముందు నిర్ణయించుకోవాలి. పెద్ద లక్ష్యాన్ని పెట్టుకోండి. అయితే ఒక్కరోజులో దాన్ని సాధించలేరనే విషయం గుర్తుంచుకోండి. దాన్ని చేరుకోవడానికి చిన్న చిన్న మెట్లను ఏర్పరుచుకోండి. రోజులో మీకు అతిముఖ్యమైన పనిని ముందు చేయడానికి సిద్ధం కండి.

* ఏ రంగంలో ఉన్నా నిరంతర శోధన తప్పనిసరి. అప్పుడే ఆయా రంగాల్లో సత్తా చూపగలుగుతారు. ఇందుకోసం నిరంతర పర్యవేక్షణ, నేర్పు చాలా అవసరం. పనికి సంబంధించి రోజుతో మొదలుపెట్టి వారానికి సరిపడా ప్రణాళిక రూపొందించుకోవాలి. దానికి అనుగుణంగా ముందుకు సాగాలి.

* కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు చేస్తున్న పనిలో అర్థం కాని విషయాలను సహోద్యోగులు లేదా పై అధికారినో లేదా ఆ రంగంలో అనుభవం ఉన్న వ్యక్తిని అడిగి నివృత్తి చేసుకోవాలి. అడిగితే ఏమనుకుంటారో అన్న మీమాంస వద్దు.\

* లక్ష్యాన్ని ఓ చోట కనిపించేలా రాసి పెట్టుకోవాలి. నిరంతరం దాన్ని చూస్తూ ఉంటే సాధించాలనే తపన పెరుగుతుంది. ఆ రోజుకు మీరు అనుకున్న పనులను పూర్తిచేస్తే మీకు మీరే శభాష్‌ అనుకోండి. వీలైతే ఓ కేకో, చాక్లెట్‌తోనో పండగ చేసుకోండి.

* మీ చుట్టూ స్ఫూర్తిమంతమైన వ్యక్తులు ఉండేలా చూసుకోవాలి. అలాగే వారి సూచనలు, సలహాలను తీసుకుంటూ ముందుకు నడవాలి. మీ లక్ష్యసాధన ఎంత వరకు వచ్చిందనే విషయాన్ని సమీక్షించుకోండి. ఇది చాలా అవసరం.

* లక్ష్యానికి సంబంధించిన విషయాలపైనే దృష్టి పెట్టాలి. మిగతా వాటికి ప్రాముఖ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్