ఇలా చేస్తే.. కొత్త కొలువు సులువే!
కళాశాల జీవితానికీ, కొలువుకీ కాస్త తేడా ఉంటుంది. కొత్త వాతావరణం అలవాటవ్వడానికి కాస్త సమయం పడుతుంది. అలాగని మీవంతు ప్రయత్నం మానొద్దు. అందుకు సాయపడే సూత్రాలివిగో..!
కళాశాల జీవితానికీ, కొలువుకీ కాస్త తేడా ఉంటుంది. కొత్త వాతావరణం అలవాటవ్వడానికి కాస్త సమయం పడుతుంది. అలాగని మీవంతు ప్రయత్నం మానొద్దు. అందుకు సాయపడే సూత్రాలివిగో..!
* అప్పగించిన పనులను చేసేయడంపైనే దృష్టి ఉండొద్దు. మీ సామర్థ్యాలనూ గుర్తించండి. వాటి మీద ప్రత్యేక దృష్టిపెడితే మీకంటూ గుర్తింపు వస్తుంది. మీకు అందరి కంటే ఎక్కువ తెలుసనో లేదా తోటివారి కంటే తక్కువగా ఉన్నారనో భావించడం.. రెండూ తప్పే. ఇవి కెరియర్ను ప్రమాదంలో పడేయగలవు.
* యాంత్రికంగా లేదా మొక్కుబడిగా చేసే పని ఎదుగుదలను ఇవ్వదు. ముందు పనిని ప్రేమించడం అలవాటు చేసుకోండి. మెరుగ్గా చేయగల మెలకువలు నేర్చుకోండి. నైపుణ్యంతోబాటు వేగమూ ప్రామాణికమే. మీరు ఎంత వేగంగా ముగిస్తారనేదాన్ని బట్టి మీ స్థాయిని అంచనా వేస్తారు.
* ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని చేరే దిశగా ప్రయత్నించండి. సునాయాసంగా గమ్యం చేరిపోతాననే కలల్లో విహరించొద్దు. ఒక్కోసారి అవరోధాలూ, ఆటంకాలూ ఎదురవుతాయి. నిరాశ చెందక పట్టుదలగా గమ్యం చేరే మార్గాలను అన్వేషించాలి. అధికారులు గుర్తించడంలేదు, పదోన్నతి రాకుండా ఎవరో అడ్డుకుంటున్నారు, ఇతరుల పని కూడా అప్పగించేస్తున్నారు.. లాంటి ఆలోచనలు కుదురుగా ఉండనివ్వవు. ఒకవేళ నిజమే అయినా వాటిని పట్టించుకోకుండా హుందాగా ముందుకు సాగండి. పరిస్థితులు అవే సర్దుకుంటాయి. మోసాలూ ద్వేషాలూ తాత్కాలికం. నిజాయతీనే నెగ్గుతుంది.
* పని చేసేచోట కాలయాపన చేసేవారు, నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు, ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పేవారు.. ఇలా రకరకాల వ్యక్తులు తారసపడతారు. అలాంటివాళ్లు మీకు నచ్చకపోవచ్చు. అయినా బయట పడొద్దు. వారితో ఆత్మీయత లేకున్నా విరోధం అక్కర్లేదు కదా! చిరునవ్వుతో సరిపెట్టండి. చుట్టూ వాతావరణమైనా ఆహ్లాదంగా ఉంటుంది.
* ఎవరి మీదైనా ఏవైనా ఆరోపణలు ఉంటే తోటి వారితో పంచుకున్నందు వల్ల ఒరిగేదేమీ లేకపోగా, వాటిని మరింత వక్రీకరించి అసలు వ్యక్తులకు చేర్చే ప్రమాదం ఉంది. కనుక వీలైతే అసలు వ్యక్తితోనే చర్చించండి. లేదంటే కాలమే పరిష్కరిస్తుందని మౌనం వహించండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- హెయిర్ బన్.. స్టైలిష్గా వేసేద్దాం!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
- గడువు దాటితే వద్దు...
- చెమట వాసనా..!
ఆరోగ్యమస్తు
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
- వ్యాయామం చేయలేకపోతున్నారా?
- ఆ సమయంలో సౌకర్యంగా ఉండాలంటే..!
- ప్రొటీన్ ఎక్కువ వద్దు..
- ఇంట్లోనే డ్రైఫ్రూట్స్ చేద్దామా..!
అనుబంధం
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
- పిల్లలకీ కావాలో రొటీన్!
- ఈ పాలు పిల్లలకు ఇస్తున్నారా... ఒక్క నిమిషం!
యూత్ కార్నర్
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
- రోజంతా నడిచి... కిలిమంజారోను అధిరోహించి..!
'స్వీట్' హోం
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
- వాచీ రింగు పూల హంగు!
- తెలుపు దుస్తులే ఎందుకు?
- గులాల్ గోటా... రంగుల కళ!
వర్క్ & లైఫ్
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!
- Holi: మగాళ్ల పైన రంగులు చల్లుతూ.. కర్రలతో కొడుతూ!