మొహమాటమొద్దు!

ఇంటర్న్‌షిప్‌, అప్రెంటిస్‌షిప్‌.. చదువుకుంటూనే సంస్థల తీరును తెలుసుకోగల మార్గాలు. వీటిని రెజ్యూమెకు అదనపు వెయిటేజీని ఇచ్చే మార్గాలుగానే భావించొద్దు. ఎందుకంటే ఇవి కెరియర్‌ను నిర్మించుకునే మార్గాలు కూడా కాబట్టి..సంస్థనీ కళాశాలగానే భావించొద్దు. వెళ్లి కూర్చుంటే చాలు.. నేర్పుతారన్న భావనా వద్దు. తెలియని విషయమేదైనా నేరుగా వెళ్లి తెలుసుకోండి. అమ్మాయిలు.. ఏమనుకుంటారోనని వెనకాడొద్దు. ఇచ్చిన పనిని

Updated : 09 Feb 2022 05:08 IST

ఇంటర్న్‌షిప్‌, అప్రెంటిస్‌షిప్‌.. చదువుకుంటూనే సంస్థల తీరును తెలుసుకోగల మార్గాలు. వీటిని రెజ్యూమెకు అదనపు వెయిటేజీని ఇచ్చే మార్గాలుగానే భావించొద్దు. ఎందుకంటే ఇవి కెరియర్‌ను నిర్మించుకునే మార్గాలు కూడా కాబట్టి..

సంస్థనీ కళాశాలగానే భావించొద్దు. వెళ్లి కూర్చుంటే చాలు.. నేర్పుతారన్న భావనా వద్దు. తెలియని విషయమేదైనా నేరుగా వెళ్లి తెలుసుకోండి. అమ్మాయిలు.. ఏమనుకుంటారోనని వెనకాడొద్దు. ఇచ్చిన పనిని ఉత్సాహంగా సమయానికి పూర్తి చేయండి. మొత్తంగా ఉద్యోగంలానే భావించండి.

చాలామంది వీటిని సెలవుల్లోనే ఎంచుకుంటారు. కళాశాలకు వెళుతూనే చేస్తుంటే ఆ వివరాలను సంస్థకు తెలియజేయండి. నేర్చేసుకోవాలన్న ఆరాటంలో చదువునూ నిర్లక్ష్యం చేయొద్దు. రెంటినీ సమన్వయం చేసుకోవాలి.

నిపుణులు, అనుభవజ్ఞులతో పనిచేసే అవకాశం ఇంటర్న్‌షిప్‌, అప్రెంటిస్‌షిప్‌లతో దొరుకుతుంది. వాళ్లతో పరిచయం పెంచుకోండి. అలాగని వాళ్ల సమయాన్ని వృథా చేయొద్దు. వాళ్ల పని, హోదా మొదలైనవి తెలుసుకోండి. తర్వాత కనిపించినప్పుడు పలకరించినా సరిపోతుంది. కావాలంటే కెరియర్‌ పరమైన సందేహాలనూ అడగొచ్చు.

ఇక్కడ మీ ఉద్దేశం నేర్చుకోవడమే. కాబట్టి, తెలియదు అనడానికి సందేహించొద్దు. అర్థం కాని విషయాలను ప్రశ్నించండి. పైగా ఇది ఎదుటివారికి మీ ఆసక్తిని తెలియజేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్