ఇలా చేస్తే కెరీర్‌లో పైపైకి...

ఉద్యోగంలో ఉన్నచోటే చాన్నాళ్లుగా నిలిచిపోయారా? ఇది మీ ఒక్కరి సమస్య మాత్రమే కాదు! మరి, దీన్ని ఎలా పరిష్కరించుకోవాలంటే...

Published : 18 Feb 2022 01:23 IST

ఉద్యోగంలో ఉన్నచోటే చాన్నాళ్లుగా నిలిచిపోయారా? ఇది మీ ఒక్కరి సమస్య మాత్రమే కాదు! మరి, దీన్ని ఎలా పరిష్కరించుకోవాలంటే...

నేర్చు కోవడం ఆపొద్దు... కెరీర్‌కు సంబంధించిన కొత్త విషయాలు తెలుసుకోవడం, నేర్చుకోవడం నిరంతరం కొనసాగించాలి. దీనికోసం కొత్త కోర్సులు చేయడం ఒక మార్గం. లింక్డిన్‌, ఐఎన్‌సీడాట్‌కామ్‌ లాంటి వాటిలో మీ రంగంలో వస్తోన్న మార్పుల్ని తెలుసుకోవచ్చు.

విరామం తీసుకోండి... అదే పనిగా సీటుకి అతుక్కుపోకుండా లంచ్‌, టీ బ్రేక్‌లు తీసుకోండి. దీనివల్ల మెదడుకు కాసేపు విశ్రాంతి దొరికి, రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు. దాంతో సకాలంలో లక్ష్యాన్ని పూర్తిచేయగలరు. దీంతో బాస్‌కు మీపైన నమ్మకం పెరుగుతుంది.  

పని కనిపించాలి... చాలామంది పనిచేస్తున్నాం కానీ, గుర్తింపు రావడం లేదని ఫిర్యాదు చేస్తుంటారు. గుంపులో ఒకరిగా ఉంటే మీరు కోరుకున్న గుర్తింపు ఎప్పటికీ రాకపోవచ్చు. ప్రాజెక్టుల్లో, సమావేశాల్లో, ప్రత్యేక సందర్భాల్లో అందరికంటే ముందుండాలి. అవకాశం లభించినపుడు మీ ముద్ర చూపించాలి.

తప్పుల గురించి భయపడొద్దు... పొరపాట్లు జరుగుతాయేమోనని భయపడుతూ చొరవ చూపకుండా, కొత్తదనం కోసం ప్రయత్నించకుండా ఉంటే కెరియర్‌కు నష్టమే. ప్రారంభంలో పొరపాట్లు చేసేవాళ్లు మిగతావాళ్లకంటే వేగంగా నేర్చుకుంటారు. అవి అనుభవ పాఠాలుగా ఉపయోగపడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్