మీ అర్హత సరిపోతుందా...

సుమిత్రకు పెళ్లి, పిల్లలు కారణంగా అయిదేళ్లు ఉద్యోగంలో విరామం తీసుకుంది. సెకండ్‌ ఇన్నింగ్స్‌గా రెండోసారి ఉద్యోగ ప్రయత్నాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం పెరిగిన సాంకేతికత, కొత్త కోర్సులపై అవగాహనతోపాటు అర్హతను కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. ఇంకా ఏం సూచిస్తున్నారంటే...

Updated : 27 Feb 2022 05:39 IST

సుమిత్రకు పెళ్లి, పిల్లలు కారణంగా అయిదేళ్లు ఉద్యోగంలో విరామం తీసుకుంది. సెకండ్‌ ఇన్నింగ్స్‌గా రెండోసారి ఉద్యోగ ప్రయత్నాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం పెరిగిన సాంకేతికత, కొత్త కోర్సులపై అవగాహనతోపాటు అర్హతను కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. ఇంకా ఏం సూచిస్తున్నారంటే...

అవగాహన.. ప్రస్తుతం చాలా సంస్థలు రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించే మహిళలకు ఆహ్వానం పలుకుతున్నాయి. ముందుగా ఆ సంస్థ వెబ్‌ సైట్‌లోకి వెళ్లి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి. ఆపై ఎంచుకోవాలి. ఇప్పటివరకు ఆ సంస్థలో పనిచేస్తున్న మహిళల శాతం నుంచి ఆ సంస్థ విధివిధానాల వరకూ అవగాహన పొందాలి. అక్కడ మీరు కెరియర్‌ను ప్రారంభించ గలుగుతారా అని ఆలోచించే ముందు అక్కడ ఖాళీ ఉన్న ఉద్యోగాలకు మీ అర్హత సరిపోతుందా ఆలోచించాలి. అలా వీలుకాకపోతే అదనపు అర్హత సాధించడానికి కృషి చేయాలి. దానికి తగిన కోర్సును పూర్తి చేయడానికి ప్రయత్నిస్తే సాధించొచ్చు. ఇప్పుడు ఏ రంగంలో అయినా నైపుణ్యాల కోసం ఆన్‌లైన్‌లో కోర్సులు ఉన్నాయి. అలా తగిన అర్హతను సాధిస్తే ధైర్యంగా ముందడుగు వేయొచ్చు.

ఇంటర్వ్యూ.. మీ దరఖాస్తులో పూర్తి వివరాలతోపాటు కెరియర్‌లో మీరు తీసుకున్న విరామం గురించి కూడా ప్రస్తావించాలి. ఆ సంస్థ నుంచి మీకు ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత దానికి తగినట్లు సిద్ధం కావాలి. టెలిఫోన్‌, వీడియో లేదా నేరుగా సంస్థ ప్రాంగణంలో... ఇలా ఏ పద్ధతిలో జరిగే ఇంటర్వ్యూకైనా  సిద్ధమవ్వాలి. హాజరయ్యే ముందే సంస్థను గురించిన పూర్తి అవగాహనతోపాటు మీ గురించి చెప్పడంలో మీకు స్పష్టత ఉండాలి. వారిచ్చే బాధ్యతను మీరెలా విజయవంతంగా నిర్వర్తిస్తారో అర్థమయ్యేలా చెప్పగలగాలి. అంతేకాదు, గత అనుభవం గురించి వివరాలు అడిగినప్పుడు అక్కడ మీరు చేపట్టిన బాధ్యతలు, పూర్తి చేసిన ప్రాజెక్టులు, ప్రశంసలు వంటివి చెప్పాలి. మీకు అప్పజెప్పే బాధ్యతల గురించి ముందుగానే స్పష్టంగా అడిగి తెలుసుకోవాలి. అక్కడి నియమాలు, నిబంధనలు, డ్రస్‌ కోడ్‌పై వివరణను చివర్లో అడిగి తెలుసుకుంటే మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్