పార్ట్‌ టైం ఉద్యోగం చేయాలనుకుంటే...

లత బాగా చదువుకుంది. అయితే ఇంటిబాధ్యతలతో తనకంటూ కెరీర్‌ను ఏర్పరుచుకోలేకపోయింది. ఏదైనా పార్ట్‌ టైం ఉద్యోగం చేస్తే, కొంత అనుభవాన్నీ పొందొచ్చని అనుకున్నా కూడా, ఏ రంగంలో

Published : 03 Mar 2022 01:32 IST

లత బాగా చదువుకుంది. అయితే ఇంటిబాధ్యతలతో తనకంటూ కెరీర్‌ను ఏర్పరుచుకోలేకపోయింది. ఏదైనా పార్ట్‌ టైం ఉద్యోగం చేస్తే, కొంత అనుభవాన్నీ పొందొచ్చని అనుకున్నా కూడా, ఏ రంగంలో అడుగుపెట్టాలో ఆమె తేల్చుకోలేకపోతోంది. వ్యక్తిగతబాధ్యతలతోపాటు ఉద్యోగ బాధ్యతలు జీవితాన్ని సమన్వయం చేయడం నేర్పుతాయంటున్నారు కెరీర్‌ నిపుణులు. ఇందుకోసం కొన్ని సూచనలిస్తున్నారు.

కస్టమర్‌ సర్వీస్‌...

కొత్త, పాత లేకుండా అందరితోనూ బాగా మెలగగలిగే తత్వం ఉంటే చాలు. ఈ ఉద్యోగాన్ని ఎంచుకోవచ్చు. ప్రతి సంస్థకూ ఈ విభాగం తప్పనిసరిగా ఉంటుంది. ఇందులోకి అడుగుపెట్టగలిగితే నియమిత సమయం మాత్రమే ఎంచుకొని చేయడానికి వీలుంటుంది. మరికొన్ని సంస్థలకు  ఇంట్లో నుంచి కూడా ఈ ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంటుంది.

సేల్స్‌  కన్సెల్టెంట్‌..

కమ్యూనికేషన్‌లో నైపుణ్యం ఉంటే ఇందులోకి అడుగుపెట్టి సామర్థ్యాన్ని చాటొచ్చు. చాలా సంస్థలిప్పుడు పార్ట్‌టైం సేల్స్‌ ఉద్యోగులు లేదా టెలీ కాలర్స్‌ కోసం ఎదురుచూస్తున్నాయి. సదరు ఆయా సంస్థల అభివృద్ధిలో ఈ ఉద్యోగం ప్రధానంగా నిలుస్తుంది. అలాగే హోమ్‌ ట్యూటర్స్‌గా నియమకాలు జరుగుతున్నాయి. పలు విద్యాసంస్థలు తమ తరఫున ప్రత్యేక కోర్సుల బోధనకు ట్యూటర్స్‌కు ఆహ్వానం పలుకుతున్నాయి. నియమిత వేళల్లో ఈ తరగతులు నిర్వహిస్తే చాలు. సరైన అర్హత ఉంటే మాత్రం ఇందులోకి అడుగుపెట్టి, నిత్య విద్యార్థిగానూ నిలవొచ్చు. భవిష్యత్తులో ఈ అనుభవం మరింత ఉపయోగకరంగానూ మారొచ్చు.

కంటెంట్‌ రైటర్‌..

పుస్తకపఠనం, పలు విషయాల్లో పరిజ్ఞానం, కరెంట్‌ ఎఫైర్స్‌పై అవగాహన ఉండి, దాన్ని బాగా అర్థమయ్యేలా అందమైన పదాల్లో రాయగలిగితే కంటెంట్‌ రైటర్స్‌గానూ కెరీర్‌ ప్రారంభించొచ్చు. సోషల్‌మీడియాలో చురుకుగా ఉన్నవారికి తమకు తెలిసిన చిత్రకళ, వంట, తోటపెంపకం వంటివాటిపై ఇతరులకు ఉపయోగపడేలా పొందుపరచగలిగితే చాలు. పార్ట్‌టైం ఉద్యోగంగా కొంత సమయాన్ని వీటికి కేటాయించగలిగితే క్రమేపీ ఇది స్వయం ఉపాథిగానూ మారే అవకాశాలెక్కువ.

గ్రాఫిక్‌ డిజైనర్‌గా..

సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్‌ లేదా గ్రాఫిక్‌ డిజైన్‌లో సామర్థ్యం, అర్హత ఉంటే దానికి సంబంధించిన సంస్థల్లో స్థానాన్ని సంపాదించొచ్చు. సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్‌, వెబ్‌సైట్‌ లే అవుట్‌, మెయింటినెన్స్‌ లేదా ఆ సైట్‌ను అప్‌డేట్‌ చేయడం వంటి బాధ్యతలుంటాయి. ఇది కూడా పార్ట్‌టైం లేదా ఇంట్లోంచి చేయడానికి వీలుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్