మీ సామర్థ్యాలు వివరించాలి...

రాధిక గత అనుభవంతో కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి హాజరవుతోంది. అక్కడెలా మాట్లాడాలి, తన గురించి అడిగితే ఎంత వరకు చెప్పాలనేది అవగాహన రావడంలేదు. ఇటువంటి సందర్భాల్లో సామర్థ్యాలను

Published : 09 Mar 2022 00:49 IST

రాధిక గత అనుభవంతో కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి హాజరవుతోంది. అక్కడెలా మాట్లాడాలి, తన గురించి అడిగితే ఎంత వరకు చెప్పాలనేది అవగాహన రావడంలేదు. ఇటువంటి సందర్భాల్లో సామర్థ్యాలను వివరించడం సరైన పద్ధతి అంటున్నారు కెరీర్‌ నిపుణులు. మరిన్ని సూచనలనూ అందిస్తున్నారిలా...

నమ్మకం... మీరు సమర్పించిన దరఖాస్తులో పూర్తి వివరాలున్నప్పటికీ గత ఉద్యోగ అనుభవాలు, అక్కడ మీరు చూపించిన సామర్థ్యాలను మాటల్లో చెప్పగలిగే విధానమే ఎదుటివారిని ప్రభావితం చేయొచ్చు. సదరు ఉద్యోగ బాధ్యతలను మీకు అందిస్తే సక్రమంగా నిర్వర్తిస్తారనే నమ్మకం కలగొచ్చు. అప్పగించాలనుకుంటున్న ఆ స్థానంలో గతంలో ఉన్న వ్యక్తులకన్నా మీరు మరింత ప్రతిభావంతులుగా కనిపించడానికి మీ అనుభవాలు వారికి ఆధారం కావొచ్చు. కాబట్టి ఈ అంశాన్ని మరవకూడదు. ఇందులో మీ ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. అతిగా ఉంటుందనే ఆలోచనను పక్కన పెట్టి నిజాయితీగా మీ గత విజయాలను వీలైనంత క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నించడం మేలు.

ఒత్తిడిలోనూ... ఇంటర్వ్యూలో ఒత్తిడిని ప్రదర్శించకుండా ప్రశాంతంగా చిరునవ్వుతో మాట్లాడగలగాలి. అలాగే గత ఉద్యోగంలో ఎదురైన ఒత్తిడిని ఎలా జయించారో, దానివల్ల ఆ సంస్థకు ఎటువంటి ప్రయోజనాలు అందాయో చెప్పాలి. మీరు నేతృత్వంవహించిన బృందంపై ఒత్తిడి తేకుండా సమన్వయంగా వ్యవహరించి అందరి సామర్థ్యాలనూ ఒకే తాటిపై తీసుకొచ్చిన విధానం, అలాగే దానివల్ల దక్కిన ఉత్తమ ఫలితాలనూ వివరించాలి. అప్పుడే మీ నైపుణ్యాలు వారికి తెలుస్తాయి. గత ఉద్యోగంలో ప్రదర్శించిన మీ సానుకూలత ఈ ఇంటర్వ్యూలో మీకు సాయపడొచ్చు.

కారణం... అక్కడ అన్ని విజయాలను సాధించిన మీరు ఏ కారణంతో మరో ఉద్యోగంలోకి అడుగుపెట్టాలనుకుంటున్నారని ఎదుటివారు మిమ్మల్ని ప్రశ్నించొచ్చు. కెరీర్‌లో ఎదగాలంటే ఎన్నో రకాల అనుభవాలు అందిపుచ్చుకోవాలనుకుంటున్నట్లు వారికి చెప్పగలగాలి. సంస్థలతోపాటు పలురకాల వ్యక్తులతో కలిసి పనిచేయాలన్న మీ ఆలోచన వివరించాలి. కొత్త విషయాలను నేర్చుకోవాలనే మీ జిజ్ఞాస అవతలివారిని మెప్పించొచ్చు. అలాగే ఈ సంస్థ పనితీరు, విధివిధానాలను తెలుసుకున్నతర్వాత కలిసి పనిచేయాలనే మీ ఆసక్తి పెరిగిందని తెలియజేస్తే చాలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్