ఈ ఉద్యోగాలు గృహిణులకే!

చాలామంది విద్యావంతులైన మహిళలు పరిస్థితుల కారణంగా ఇంటికి పరిమితమవుతారు. అంత మాత్రాన వారికి నైపుణ్యాలు ఉండవని కాదు. అందుకే గృహిణులకూ ఉద్యోగాలిస్తాం అంటోంది..

Published : 09 Mar 2022 00:57 IST

చాలామంది విద్యావంతులైన మహిళలు పరిస్థితుల కారణంగా ఇంటికి పరిమితమవుతారు. అంత మాత్రాన వారికి నైపుణ్యాలు ఉండవని కాదు. అందుకే గృహిణులకూ ఉద్యోగాలిస్తాం అంటోంది యాక్సిస్‌ బ్యాంకు. ‘గృహిణులు తమ సమయాన్ని ఇంటి బడ్జెట్‌ నిర్వహణకూ, ఇంటిని శుభ్రంగా ఉంచడానికి, పిల్లల చదువులకూ, వారి అభివృద్ధికీ కేటాయిస్తారు. ఏ కుటుంబానికైనా వాళ్లే మూలస్తంభం. వారి విలువైన అనుభవాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాం’ అంటారు యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ రాజ్‌కమల్‌ వెంపటి. ఈ ఆలోచన వెనక గృహిణి పల్లవి శర్మ కారణమని చెబుతారామె. పల్లవి ఇంటి దగ్గర చేసే పనులు, ఆమె దరఖాస్తు చేసిన ఉద్యోగ విధులకు ఎలా సరిపోతాయో రెజ్యుమేలో వివరించారు. ఆ నైపుణ్యాలు  గృహిణులందరికీ ఉంటాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామంటారు రాజ్‌కమల్‌. ఉద్యోగ అనుభవం అసలే లేనివారితోపాటు, విరామం తర్వాత కెరియర్‌ను కొనసాగించాలనుకున్నవారికీ అవకాశం ఇస్తున్నారు. ఈ  ప్రక్రియ పల్లవి ఆధ్వర్యంలోనే నడవడం విశేషం. డిగ్రీ పూర్తిచేసిన వారికి మార్కెటింగ్‌, హెచ్‌.ఆర్‌. మొదలైన విభాగాల్లో అవకాశాలు ఇస్తున్నారు. టైటాన్‌ కంపెనీ కూడా గృహిణులకు ఉద్యోగావకాశం ఇస్తోంది.‘మా విభాగంలో ఆభరణాలూ ఉన్నాయి. వాటి గురించి గృహిణులకంటే ఎవరికి బాగా తెలుస్తుంది. అందుకే వారి సేవల్ని వినియోగించుకోవాలనుకుంటున్నాం’ అంటారు కంపెనీ మానవ వనరుల విభాగం హెడ్‌ ప్రియ. ఇప్పటికైనా గృహిణుల విలువ ప్రపంచానికి తెలుస్తోందన్న మాట!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్