ఎండల్లోనూ మెరిసిపోండి

ఎండలు బాగా పెరిగిపోయాయి కదా! బయటకు వెళ్లొచ్చామంటే వేడికి చర్మం నల్లబడటం, మెరుపును కోల్పోవడం, చెమట కారణంగా అలర్జీలు.. ఎన్ని సమస్యలో! ఈ పూతలను వేయండి

Updated : 19 Mar 2022 03:35 IST

ఎండలు బాగా పెరిగిపోయాయి కదా! బయటకు వెళ్లొచ్చామంటే వేడికి చర్మం నల్లబడటం, మెరుపును కోల్పోవడం, చెమట కారణంగా అలర్జీలు.. ఎన్ని సమస్యలో! ఈ పూతలను వేయండి.. వాటి నుంచి తప్పించుకోవచ్చు.

* రెండు చెంచాల చొప్పున గులాబీ రేకల పొడి, గంధం తీసుకొని, వాటికి తగినన్ని రోజ్‌వాటర్‌, పావు స్పూను తేనె, చిటికెడు పసుపు చేర్చాలి. వీటిని బాగా కలిపి ముఖానికీ మెడకీ పట్టించి, 15 నిమిషాలయ్యాక కడిగేయండి. ముఖం చక్కగా, మృదువుగా తయారవుతుంది.
* రెండు స్పూన్ల బియ్యప్పిండికి స్పూను తేనె, తగినన్ని పాలు కలిపి కడిగిన ముఖానికి రాయాలి. ఆరాక కొద్దికొద్దిగా తడిచేసుకుంటూ ముఖాన్ని రుద్ది కడిగేస్తే సరి. మృతకణాలు తొలగడంతోపాటు ఎండ వేడికి నల్లబడిన చర్మం తిరిగి కాంతులీనుతుంది.
*  చల్లారిన గ్రీన్‌టీ రెండు స్పూన్లు, టేబుల్‌ స్పూను చొప్పున పాలు, కోకో పౌడర్‌ తీసుకుని బాగా కలపాలి. దీన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాలు ఉంచి కడిగేయాలి. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు చర్మానికి పోషణనివ్వడంతోపాటు దద్దుర్లు, కమలడం వంటి వాటినీ దూరం చేస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్