ఆరు సూత్రాలతో అలసట దూరం..

అమలను తరచుగా అలసట ఆవరిస్తుంది. చిన్న పని కూడా చేయలేనన్నట్లుగా శరీరం మొండికేస్తుంది.  ఇటువంటి సమస్య అందరు మహిళల్లో అప్పుడప్పుడు బయట పడుతుందంటున్నారు నిపుణులు.

Published : 21 Mar 2022 02:06 IST

అమలను తరచుగా అలసట ఆవరిస్తుంది. చిన్న పని కూడా చేయలేనన్నట్లుగా శరీరం మొండికేస్తుంది.  ఇటువంటి సమస్య అందరు మహిళల్లో అప్పుడప్పుడు బయట పడుతుందంటున్నారు నిపుణులు. ఇది శారీరక, మానసిక అలసట కావొచ్చు అని చెబుతున్నారు.

1. సమయం.. కొందరు ప్రతి నిమిషమూ విలువైనదిగా చూస్తారు. దాంతో తీరిక లేకుండా పని చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు. ఇది శరీరం, మెదడు పైన తెలియని ఒత్తిడి కలిగిస్తుంది. అప్పుడే విరామం అవసరమని అర్థం చేసుకోవాలి. కాసేపు నిద్రకు సమయాన్ని కేటాయించి చూడండి.  

2. కలిసిమెలిసి.. కొందరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. దాంతో ఫోన్‌ వినియోగం ఎక్కువ. దీని ప్రభావం అకస్మాత్తుగా శరీరంలో శక్తి అంతా తగ్గిపోయినట్లుగా అనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో గడిపితే మనసు తేలికవుతుంది.  

3. ఒత్తిడికి దూరంగా.. తెలియకుండానే మనసుని ఒత్తిడికి గురి చేస్తాం. అనవసర విషయాలకి ప్రాధాన్యం ఇస్తాం. ఇవన్నీ చెడు ప్రభావాన్ని కలిగిస్తాయి. ఏది ముఖ్యం అనే అవగాహన ఉంటే చాలు.

4. ధ్యానం.. రోజూ అరగంటసేపు చేసే ధ్యానం మనసును ప్రశాంతంగా మారుస్తుంది.  ఉదయంపూట, అలాగే రాత్రి నిద్రపోయేముందు పది నిమిషాలు చేసే ధ్యానం మంచి నిద్రను తెచ్చిపెడుతుంది.  

5. అలవాటు.. ప్రతి ఒక్కరికీ అభిరుచులు ఉంటాయి. చిత్రలేఖనం, పుస్తకపఠనం, క్రీడలు, మొక్కల పెంపకం వంటివెన్నో ఉంటాయి. వాటిలో మనసుకు నచ్చింది ఎంచుకొని రోజూ కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. ఈ అలవాటు మనసుకు వ్యాయామంగా మారుతుంది.

6. ప్రయాణం.. కొత్త ప్రాంతాన్ని పర్యటించి రావడం లేదా బాల్యంలో తిరిగిన ప్రాంతాలను చూసిరావడం వంటివి మనసును తేలికపరుస్తాయి. అలాగే స్నేహితులను కలవడం, వారితో చిన్నప్పటి జ్ఞాపకాలను చర్చించడం చేస్తే మానసిక సంతోషం దరి చేరుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్