ఆత్మవిశ్వాసమే మీ విజయం..

ప్రసూనకది మొదటి ఇంటర్వ్యూ. ఏం ప్రశ్నలు అడుగుతారో అని రాత్రీ పగలు పుస్తకాలను వదలడం లేదు. ఏ ఇంటర్వ్యూలోనైనా ఉద్యోగానికి సంబంధించి ప్రశ్నలు 50 శాతమే ఉంటాయి. మిగతా

Published : 24 Mar 2022 01:37 IST

ప్రసూనకది మొదటి ఇంటర్వ్యూ. ఏం ప్రశ్నలు అడుగుతారో అని రాత్రీ పగలు పుస్తకాలను వదలడం లేదు. ఏ ఇంటర్వ్యూలోనైనా ఉద్యోగానికి సంబంధించి ప్రశ్నలు 50 శాతమే ఉంటాయి. మిగతా భాగమంతా మీరు సమాధానాలు చెప్పే తీరు, అభిప్రాయాలు, ఆత్మవిశ్వాసం వంటి అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది అంటున్నారు కెరీర్‌ నిపుణులు.

ప్రశాంతంగా... మీ ఫైల్‌లో అర్హతల ధ్రువపత్రాలతోపాటు మీ మనసులో ప్రశాంతత కూడా తప్పనిసరి. ఆందోళనగా ఉన్నప్పుడు తెలిసింది కూడా సరిగ్గా చెప్పలేం. ముఖంపై చిరునవ్వుతో ఇంటర్వ్యూ హాల్‌లోకి అడుగు పెట్టాలి. విష్‌ చేసి కూర్చున్న తర్వాత మీ సర్టిఫికెట్స్‌ను వారి ముందుంచాలి. ఏం ప్రశ్నలు వేస్తారో అనే ఆందోళనను పక్కన పెట్టాలి. వేరే ఏ ఆలోచన లేకుండా ఉంటేనే సరైన సమాధానాలివ్వగలరు. కాళ్లు, చేతులనెక్కువగా కదిపితే అవతలి వారి ఏకాగ్రత మళ్లుతుంది. అంతేకాదు, మీలోని ఒత్తిడిని మీ కదలికలు బయటపెడతాయి.

సూటిగా... ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు  పక్కకో, కిందకో చూడకుండా, ప్రశ్నలు అడుగుతున్న వారి కళ్లల్లోకి సూటిగా చూడాలి. ఇలా చేస్తే అవతలి వారికి మీ ధైర్యం కనబడుతుంది. అలాగని నిరంతరాయంగానూ చూడకూడదు. మధ్యమధ్యలో మీ చూపును మరలించాలి. ప్రశ్న అర్థం కాకపోతే మొహమాటం, ఇబ్బంది పడకుండా, మరోసారి తెలుసుకోవచ్చా అని మర్యాద పూర్వకంగా అడగొచ్చు. మీకు సమాధానం తెలియకపోయినా దానికి అనుబంధంగా ఉండే అంశాన్ని చెప్పి, పూర్తి వివరాలు తెలియదని స్పష్టంగా చెప్పగలగాలి. తప్పు చెప్పేదానికన్నా, ఇది మంచి పద్ధతి.

సానుకూలం.. మీ సమాధానాల్లో సానుకూలత కనిపించాలి. ఫలానా బాధ్యతలు ఇస్తే ఎలా నిర్వహిస్తారని అడిగినప్పుడు సమాధానంలో మీ చురుకుదనం, బాధ్యతలను  పూర్తిగా నిర్వర్తిస్తారనే భావం అవతలివారికి చేరాలి. అందులోని సమస్యలను ఎలా దాటగలరని అడిగితే మీరెలా అధిగమించాలనుకుంటున్నారో చెప్పాలి. అలా మీలోని ఆత్మవిశ్వాసం ఎదుటివారికి కనిపించాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని