ఈ ఆరూ మీలో ఉన్నాయా?

కెరియర్‌ను ఎంచుకొని సంబంధిత కోర్సును చేయడమే కాదు. ఉద్యోగంలోకి అడుగు పెట్టేటప్పుడూ దానికి అవసరమయ్యే నైపుణ్యాలు కూడా ఉంటే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

Published : 29 Mar 2022 01:24 IST

కెరియర్‌ను ఎంచుకొని సంబంధిత కోర్సును చేయడమే కాదు. ఉద్యోగంలోకి అడుగు పెట్టేటప్పుడూ దానికి అవసరమయ్యే నైపుణ్యాలు కూడా ఉంటే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

దృక్పథం.. సమయానికి తగినట్లుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సందర్భానుసారం ఇతర వ్యక్తుల ఆలోచనలనూ కలుపుకొని సాగేలా ఆలోచనాదృక్పథం ఉండాలి. ఎదుటి వారి ఆలోచనల్లో ఉండే విలువైన అంశాల్ని స్వీకరించడం నేర్చుకుంటే చాలు.

కమ్యూనికేషన్‌... ఇతరులతో మర్యాదగా నడుచుకుంటూ, మంచి అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి. ఎవరినీ నొప్పించకూడదు. కిందివారంటే చులకన, పై అధికారితో అతి వినయం... రెండూ మంచివి కాదు. స్థానాలకన్నా వ్యక్తులకు విలువనిస్తే సత్సంబంధాలు కొనసాగుతాయి. ఇవన్నీ మీ పని తీరుపై ప్రభావాన్ని చూపిస్తాయి. బాధ్యతల నిర్వహణలో ఉపకరిస్తాయి.

పరిష్కారం.. సమస్య వస్తే ప్రశాంతంగా ఆలోచించి పరిష్కారాన్ని కనుగొనే నైపుణ్యాలను పెంచుకోవాలి. దేన్నీ భూతద్దంలో చూడకూడదు. అది ఇతరుల సమస్య అయితే ఏం పరిష్కారం సూచిస్తారు అన్న కోణంలో ఆలోచిస్తే సమస్య తీరినట్లే. చిన్న సూదినైనా కంటికి దగ్గరగా ఉంచితే పెద్దగానే కనిపిస్తుంది. కొంచెం దూరంగా ఉంచి చూస్తేనే అసలు పరిమాణం తెలుస్తుంది. ఈ సూత్రాన్ని ఉపయోగిస్తే చాలు.

సృజనాత్మకత.. బాధ్యతలను ఏదోలా పూర్తిచేయాలని కాకుండా కొంత సృజనాత్మకతను కలిపి చూడండి. మరింత ఆసక్తిగానూ అనిపిస్తుంది. పనితో తృప్తి కలుగుతుంది. చిన్నపని కూడా ఈ నైపుణ్యంతో చేయగలిగితే మనసుకే కాదు, పై అధికారులకూ మీపై నమ్మకం కలుగుతుంది. ఏ బాధ్యతనిచ్చినా సమర్థంగా చేస్తారనే భరోసా మీపై వారికి కలుగుతుంది.  

బాధ్యత.. మనకు మనం ముందుగా పని పట్ల పూర్తి బాధ్యతతో ఉండాలి. అలా జరగాలంటే పనిపై అవగాహన రావాలి. మనసు పెట్టి చేసిన చిన్న పని కూడా విజయవంతమవుతుంది.

బృందంతో.. వ్యక్తిగత విజయంతోపాటు బృందంతోనూ కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎదుటి వారిలో ప్రత్యేకతలకు తగిన బాధ్యతలను అప్పగిస్తే చాలు. అందరితో వారి వారి నైపుణ్యాలను ఆధారంగా చేసుకొని పని పూర్తి చేయించగలగాలి. అప్పుడే సత్ఫలితాలుంటాయి. అలాకాకుండా మీకు మాత్రమే అన్నీ తెలుసనే ఆలోచన ఉంటే మాత్రం బృందంతో కలిసి పనిచేయడం కష్టమవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్