ఇలాగైతే.. ఎదిగేదెలా?

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. కొన్ని నెలల క్రితం ఇక ఎప్పటికీ ఇంటి నుంచే పని అని సంస్థ నుంచి ఉత్తర్వులు అందుకున్నా. హైదరాబాద్‌లో ఉన్న సంస్థనీ మూసేసి, బెంగళూరు నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు

Updated : 30 Mar 2022 14:13 IST

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. కొన్ని నెలల క్రితం ఇక ఎప్పటికీ ఇంటి నుంచే పని అని సంస్థ నుంచి ఉత్తర్వులు అందుకున్నా. హైదరాబాద్‌లో ఉన్న సంస్థనీ మూసేసి, బెంగళూరు నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మామూలుగానే అమ్మాయిలకి నెట్‌వర్కింగ్‌ పరంగా ఎన్నో సమస్యలు. ఇక పూర్తిగా ఇంటి నుంచే పనైతే అదింకా అసాధ్యమవుతుంది కదా? మరి కెరియర్‌లో ఎదిగేదెలా?

  - పూర్ణ

మీరు చెప్పింది నిజమే.. వర్కింగ్‌ ఫ్రమ్‌ హోమ్‌ మహిళలకు వృత్తిపరంగా నష్టమే. అత్యవసర సమయాల్లో ఆకస్మిక సలహాలు, నిర్ణయాలు ఉద్యోగులకు గుర్తింపు తెచ్చే, కెరియర్‌ను ముందుకు తీసుకెళ్లే సాధనాలు. ఆన్‌లైన్‌ కమ్యూనికేషన్‌లో వీటికి తావుండదు. కొన్ని సంస్థలు ఇప్పటికే కార్యాలయాలకు ఆహ్వానిస్తున్నా.. పిల్లలకు ఆన్‌లైన్‌ తరగతులు, మరికొన్ని బాధ్యతల కారణంగా ఎక్కువ శాతం మహిళలకు ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. మగవారిని మాత్రం రప్పిస్తున్నాయి. అంటే సగం ఆన్‌లైన్‌ సగం ఆఫ్‌లైన్‌ అన్నమాట. ఆఫ్‌లైన్‌లో పనిచేస్తున్న వారికి సహోద్యోగులతో సంబంధ బాంధవ్యాలు, పని పంచుకోవడం లాంటి అవకాశాలుంటాయి. ఇంటి నుంచి పనిలో ఆ అవకాశం లేనట్లేగా! అంటే ఇక్కడ పనికి అవసరమైన నైపుణ్యాలు, వృత్తిగత సంబంధ బాంధవ్యాలను కోల్పోతున్నదెవరు? మళ్లీ ఆడవారే.
కాబట్టి, పని ప్రదేశంతో, తోటివారితో సత్సంబంధాలు ఉండేలా చూసుకోండి. పని సమయంలో ఇంటి బాధ్యతలను రానివ్వకండి. వారంలో కొన్నిరోజులైనా వారితో వీడియో కాల్‌ మాట్లాడండి. రోజువారీ సంభాషణలు తప్పక సాగేలా చూసుకోండి. బృందంతో కలిసి బయటికి వెళ్లడం వంటివీ చేయండి. కొన్ని దీర్ఘకాల లక్ష్యాలను పెట్టుకొని, సాధిస్తూ వెళ్లండి. వాటిని పని చేసే చోట అతికించుకుంటే మీకూ స్ఫూర్తిగా ఉంటుంది. అవసరమైతే మీ బాస్‌కీ వీటిని తెలియజేయొచ్చు. ముఖ్యమైన మీటింగ్‌లు, కాన్ఫరెన్స్‌లకు మిమ్మల్ని సిఫారసు చేస్తారు. సామాజిక మాధ్యమాల ద్వారా మీ రంగ ప్రముఖులతో సత్సంబంధాలను నెరపండి. ఒంటరి అయిపోయిన, అవకాశాలకు దూరమయ్యానన్న భావనుండదు. ప్రయత్నిస్తే ఆన్‌లైన్‌ కూడా మంచి నెట్‌వర్క్‌ మార్గమే!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్