వారాంతంలో సంతోషంగా...

అక్షయ వారమంతా బిజీ. కుటుంబానికి దూరంగా ఉండే తను, ఎప్పుడెప్పుడు సెలవు వస్తుందా అని ఆత్రుతగా చూస్తుంది. తీరా ఆ రోజు ఏం చేస్తుందో అర్థం కాదు.  విశ్రాంతి తీసుకున్నట్టూ ఉండదు.

Updated : 02 Apr 2022 04:36 IST

అక్షయ వారమంతా బిజీ. కుటుంబానికి దూరంగా ఉండే తను, ఎప్పుడెప్పుడు సెలవు వస్తుందా అని ఆత్రుతగా చూస్తుంది. తీరా ఆ రోజు ఏం చేస్తుందో అర్థం కాదు.  విశ్రాంతి తీసుకున్నట్టూ ఉండదు. అలాకాక సెలవు రోజుని తృప్తిగా ఎలా గడపొచ్చు, ఫలితంగా తర్వాత వారానికి తగినంత శక్తిని ఎలా పొందొచ్చనేది నిపుణులు వివరిస్తున్నారు.

నచ్చిన చోటు.. ఇల్లెంత ఉన్నా, మనకు నచ్చిన గది లేదా చోటు ఒకటి ఉంటుంది. టీ తాగడం, పుస్తకపఠనం, కాసేపు టీవీ చూసే ప్రాంతాన్ని అందంగా సర్దుకోవచ్చు. అక్కడ కూర్చున్నప్పుడల్లా ప్రశాంతంగా ఉండేలా కొన్ని ఇండోర్‌ మొక్కలను అందమైన జార్స్‌లో సర్ది అక్కడ ఉంచాలి. వారమంతా తీసి పడేసిన పుస్తకాలను అందంగా అమర్చుకుంటే చాలు. అది మరింత ఇష్టపడే ప్రాంతంగా మారిపోతుంది.

స్నేహితులతో.. స్నేహితులను పలకరించాలని ఉన్నా... వీలుదొరక్క పోవచ్చు. అటువంటి వారి జాబితా రాసుకొని అందరితోనూ కాసేపు మాట్లాడాలి. కామన్‌ ఫ్రెండ్స్‌ అయితే గ్రూప్‌ కాల్‌ చేయచ్చు. వీడియో కాల్‌తో మరింత ఉత్సాహంగా ఉంటుంది. ఇది మనసు నిండా శక్తిని నింపుతుంది.

నచ్చిన వంటకం.. ఎప్పటి నుంచో తినాలని ఉన్నా, కుదరని వంటకాన్ని ఎవరినైనా అడిగి, లేదా యూట్యూబ్‌లో చూసి చేసి వేడి వేడిగా లాగిస్తే చాలు. ఆ ఆనందమే వేరు. దూరంగా ఉన్న కుటుంబ సభ్యులతో వీడియో కాల్‌ మాట్లాడండి. వారాంతం సంతోషంగా గడవడమే కాదు... రెట్టింపు ఉత్సాహంతో కొత్త వారాన్ని మొదలుపెడతాం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్