Published : 05/04/2022 01:14 IST

సమయాన్ని వృథా చేస్తున్నారా!

మనకు తెలియకుండా చేసే కొన్ని ఆలోచనలు, పనుల వల్ల మన సమయం వృథా అవుతుంది. దాంతో అనుకున్నది సాధించలేం. మరి సమయాన్ని మింగేసే ఆ పనులేంటో చూద్దామా...

ఎదురుచూడొద్దు: ఎవరో వస్తారని, మనకు స్ఫూర్తి కలిగిస్తారని, ఆశించొద్దు. మీరు చేసే పనులు, తీసుకునే నిర్ణయాల నుంచి కొత్త ఆలోచనలు పుట్టుకువస్తాయి.  అంతగా ప్రాధాన్యం లేని విషయాల గురించి అతిగా ఆలోచించి సమయం వృథా చేసుకోవద్దు.

అన్నీ చేయాలనుకోవడం: ప్రతిదీ మీరే చేయాలనుకుంటే చివరకు ఫలితాలు ప్రతికూలంగానే వస్తాయి. నిస్సత్తువతో నీరసించిపోతారు. కాబట్టి పనులను పంచడం నేర్చుకోండి. మీ వంతు సాయం చేయడం, తీసుకోవడం లాంటివి తప్పనిసరి.

ఏమనుకుంటారో అని: మీకు ఏది మంచిదనిపిస్తే దాన్ని చేయండి. అంతే తప్ప మీరు చేసే పనుల వల్ల  ఇతరులు ఏమనుకుంటారో అని సందిగ్దం వద్దు. మీ మనసుకు నచ్చిన పని చేయండి. అప్పుడే ఆనందంగా ఉంటారు.
అసంపూర్తి పనులు: వీటివల్ల శ్రమ, సమయం రెండూ వృథా అవుతాయి. మీరు చేయగలననే పనినే ఎంచుకోండి. లేదంటే వదిలేయండి.

అందరినీ మెప్పించలేరు: ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టడం సాధ్యం కాదు. ఎవరికివారు ప్రత్యేకం. కాబట్టి అందరినీ మెప్పించాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవడం వల్ల చేదు, బాధకర సంఘటనలు తప్ప ఒరిగేదేమీ లేదు. ఇది మీలో అసూయ, అభద్రతను పెంచుతుంది.

పర్‌ఫెక్షనిజమ్‌: ఒక ప్రణాళిక లేకుండా,  ఎలాంటి సన్నద్ధత చేయకుండా పర్‌ఫెక్షన్‌ కోసం ఎదురుచూడొద్దు. మీకేది వచ్చో, ఎంత వచ్చో ముందుగా ప్రయత్నించాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని