అందానికి నిమ్మ.. రాస్తారా?

నిమ్మ ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మంచిదని తెలుసు. అందానికీ ప్రయోజనకారి అని తెలుసా?

Updated : 06 Apr 2022 03:37 IST

నిమ్మ ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మంచిదని తెలుసు. అందానికీ ప్రయోజనకారి అని తెలుసా?

* సగం కోసిన నిమ్మ చెక్కమీద కొద్దిగా తేనె వేసి ముఖం, మెడ, చేతులు కాళ్లకి రుద్దండి. ఆరాక చల్లని నీటితో కడిగేస్తే సరి. చర్మఛాయలో మార్పులు, ముడతలు, నల్ల మచ్చలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. దీనిలోని సి విటమిన్‌ కొలాజన్‌ ఉత్పత్తిని పెంచి చర్మం మృదువుగా కనిపించేలా చేస్తుంది. నేరుగా రసాన్ని తీసుకుని దానిలో తేనె కలిపీ దూదితో రాసుకోవచ్చు.

* ముఖంపై మొటిమలా? కొద్దిగా నిమ్మరసాన్ని అవి ఉన్న ప్రదేశంలో రాసి, అయిదు నిమిషాలయ్యాక కడిగేయండి. దీనిలోని ఆస్కార్బిక్‌ ఆసిడ్‌ మొటిమలను దూరం చేస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు అవి తిరిగి రాకుండానూ ఆపుతాయి.

* నిమ్మ తొక్కతో పళ్లను రుద్ది చూడండి. పసుపు పచ్చదనం పోయి తెల్లగా మెరుస్తాయి. పావు చెంచా బేకింగ్‌ సోడాకి కొద్దిచుక్కల నిమ్మరసాన్ని కలిపి దాంతో పళ్లు తోమినా ప్రయోజనముంటుంది.

* ఎండ వేడి ప్రభావం పెదాలపైనా ఉంటుంది. ఫలితమే నల్లగా తయారవుతాయి. రాత్రి పడుకునే ముందు నిమ్మ రసానికి కొద్దిగా తేనె కలిపి పెదాలకు రాయండి. కొద్దిరోజుల పాటు క్రమం తప్పక ప్రయత్నిస్తే ఫలితం కనిపిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్