బ్రష్‌కో కవర్‌

ప్రయాణాల్లో మన వెంట ఉండే వస్తువుల్లో మేకప్‌ కిట్‌ కూడా ఒకటి. ముఖ్యంగా మేకప్‌ బ్రష్‌లను వెంట తీసుకువెళుతుంటాం. అయితే వీటిని బ్యాగులో నేరుగా వేయడం వల్ల దుమ్మూధూళీతోపాటు వాటిపై సూక్ష్మజీవులు కూడా చేరచ్చు. వాటి  ఆకృతీ మారిపోతుంది.

Updated : 08 Apr 2022 03:50 IST

ప్రయాణాల్లో మన వెంట ఉండే వస్తువుల్లో మేకప్‌ కిట్‌ కూడా ఒకటి. ముఖ్యంగా మేకప్‌ బ్రష్‌లను వెంట తీసుకువెళుతుంటాం. అయితే వీటిని బ్యాగులో నేరుగా వేయడం వల్ల దుమ్మూధూళీతోపాటు వాటిపై సూక్ష్మజీవులు కూడా చేరచ్చు. వాటి  ఆకృతీ మారిపోతుంది. అలా కాకుండా ఉండేందుకు ఈ కొత్తరకం మేకప్‌ కవర్‌ ఉపయోగపడుతుంది.  
పౌడర్‌, బ్రోంజర్‌, బ్లష్‌, ఇతర పెద్ద బ్రష్‌లను వీటి సాయంతో జాగ్రత్తగా ఉంచొచ్చు. సింగిల్‌, డబుల్‌; మల్టీ ఫిట్‌ రకాలుగానూ దొరుకుతాయి. సింగిల్‌ ఫిట్‌లో మందమైన హ్యాండిళ్లున్న బ్రష్‌లను పెట్టచ్చు. డబుల్‌ ఫిట్‌లో మీడియం సైజ్‌ బ్రష్‌లన్నీ పడతాయి. మల్టీ ఫిట్‌లోనూ సన్నవి, చిన్నవి  పెట్టచ్చు. చిన్న బుడగలా ఉన్న కవర్‌ చీలికలో బ్రష్‌ చివరి భాగాన్ని పెట్టి కిందకు లాగితే సరి. కుచ్చులు బుడగ లోపలికి వెళ్లిపోతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్