మీకో ప్రత్యేకత ఉండాల్సిందే!

ఉద్యోగం ప్రధానంగా ఆర్థిక వెసులుబాటు తోపాటు అంతకు మించిన ధైర్యాన్నీ, తృప్తినీ ఇస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మరి ఇంత ముఖ్యమైన కొలువు జీవితకాలం నిర్విఘ్నంగా, విజయవంతంగా సాగిపోవాలంటే ఏం చేయాలి?

Published : 11 Apr 2022 01:55 IST

ఉద్యోగం ప్రధానంగా ఆర్థిక వెసులుబాటు తోపాటు అంతకు మించిన ధైర్యాన్నీ, తృప్తినీ ఇస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మరి ఇంత ముఖ్యమైన కొలువు జీవితకాలం నిర్విఘ్నంగా, విజయవంతంగా సాగిపోవాలంటే ఏం చేయాలి?

* పని ఎప్పుడూ మొక్కుబడిగా చేయొద్దు. సాధ్యమైనంత మెరుగ్గా చేస్తూ మీరు సంతృప్తి చెందేలా చూసుకోండి. ఒక డైలాగ్‌ని నలుగురు నటులు నాలుగు విధాలుగా చెప్పినట్లు.. పనితీరులోనూ తేడాలుంటాయి. మీకంటూ ఒక ప్రత్యేకత చేకూరేలా పని చేయండి.
* మీ పని పట్ల మీకెంత విశ్వాసం ఉన్నా ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవడం కూడా అవసరమే. మిమ్మల్ని మీరు మరింత మెరుగుపరుచుకోవడానికి అది తప్పకుండా ఉపయోగపడుతుంది. అలాగే మీరు చెప్పిందే సరైందని వాదించకుండా ఎదుటివాళ్ల అభిప్రాయాలు, నిర్ణయాలకూ గౌరవం ఇవ్వండి.
* పనిలో మూస విధానానికి స్వస్తి చెప్పండి. లేదంటే ఎదుగుదల ఉండదు. ఎప్పటికప్పుడు ఇంకా కొత్తగా ఏం చేయొచ్చో ఆలోచించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్