ఇది స్నేహం కాదు..

సుమిత్ర స్నేహం సహవిద్యార్థిని రాగిణితో సజావుగానే కొనసాగుతున్నా అప్పుడప్పుడు ఇరువురి మధ్య ఏదో ఒక సమస్య చోటు చేసుకుంటుంది. రాగిణి ప్రవర్తనలో కనిపించే మార్పులు సుమిత్రను వేదనకు గురి చేస్తుంటాయి. ఎదుటివారు తమ ఆప్తమిత్రులని భావించే ముందు వారి ప్రవర్తనను సరైనరీతిలో గుర్తించాలంటున్నారు మానసిక నిపుణులు....

Published : 13 Apr 2022 00:37 IST

సుమిత్ర స్నేహం సహవిద్యార్థిని రాగిణితో సజావుగానే కొనసాగుతున్నా అప్పుడప్పుడు ఇరువురి మధ్య ఏదో ఒక సమస్య చోటు చేసుకుంటుంది. రాగిణి ప్రవర్తనలో కనిపించే మార్పులు సుమిత్రను వేదనకు గురి చేస్తుంటాయి. ఎదుటివారు తమ ఆప్తమిత్రులని భావించే ముందు వారి ప్రవర్తనను సరైనరీతిలో గుర్తించాలంటున్నారు మానసిక నిపుణులు.

స్నేహితురాలిగా భావిస్తున్న వ్యక్తి నలుగురిలో ఎగతాళి చేయడం, మనకు తెలియకుండా వెన్నుపోటు పొడవడం వంటివన్నీ స్నేహం కాదంటున్నారు నిపుణులు. కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో ఎదుటివారి మనోభావాలను సైతం లెక్కచేయకుండా అవమానం కలిగేలా ప్రవర్తించే వాళ్లకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదంటున్నారు. ఫలానావారు మంచి స్నేహితురాలు అని అనుకుంటున్నవారి వ్యవహారశైలిలో మార్పులు కనిపిస్తే తక్షణం వాటిని గుర్తించాలి. చదువు లేదా కెరీర్‌లో విజయాన్ని సాధించినప్పుడు పక్కనే నిలబడి ప్రశంసించేవారు మాత్రమే అసలైన స్నేహితులు. అలాకాకుండా దాన్ని పెద్దగా పట్టించుకోనట్లుగా నటించినవారిని మాత్రం పరిచయస్తుల పట్టిక వరకే ఉంచితే మంచిది. మరికొందరు తమకు అవసరమైనప్పుడు మాత్రమే మనల్ని గుర్తుకు తెచ్చుకుంటుంటారు. అటువంటివారిని కూడా పరిచయస్థుల్లా ఉంచుకుంటే చాలు.

దూరంగా... జీవితలక్ష్యాన్ని చెప్పినప్పుడు దానికి తమ ప్రోత్సాహం ఎప్పుడూ  ఉంటుందని చెప్పేవారు మాత్రమే మానసికంగా మనకు దగ్గరవుతారు. అలాకాకుండా అది మనవల్ల కాదని నిరుత్సాహపరిచారంటే వారిని దూరంగా ఉంచడం మంచిది. లేదంటే మన ఉత్సాహాన్ని నీరుకార్చే ప్రమాదం ఉంది. అలాగే ఏదైనా సమస్య ఎదురైనప్పుడు తోడుగా లేకుండా తప్పించుకు తిరుగుతున్నారంటే ఆ వ్యక్తులు మనకు జీవితంలో ఎప్పటికీ స్నేహితులు కాలేరు. అత్యంత ముఖ్యమైన, మీ రహస్యాలు లేదా మీకు సంబంధించిన విషయాలను స్నేహితురాలిగా భావించి చెప్పినప్పుడు వాటిని మరొకరితో పంచుకునే అమ్మాయిలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. అంతేకాదు, మన శరీర, మాటతీరును అందరిలో అవమానించేవారికి స్నేహితురాలిగానే కాదు, కనీసం పరిచయస్థురాలిగానూ స్థానం ఇవ్వకూడదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్