ఖాళీ ఫ్రేములతో అందాన్ని నింపొచ్చు...

పాత ఫొటో ఫ్రేములు, వృథాగా ఉండే ఖాళీ చెక్కఫ్రేములతో గదులను అందంగా మార్చుకోవచ్చు. ఎటువంటి ఆకారంలో ఉన్న వాటినైనా ఇంటి అలంకరణలో ఉపయోగించొచ్చు.

Published : 14 Apr 2022 01:51 IST

పాత ఫొటో ఫ్రేములు, వృథాగా ఉండే ఖాళీ చెక్కఫ్రేములతో గదులను అందంగా మార్చుకోవచ్చు. ఎటువంటి ఆకారంలో ఉన్న వాటినైనా ఇంటి అలంకరణలో ఉపయోగించొచ్చు.

వివిధ ఆకారాల్లో ఉన్న ఓ పది ఫ్రేములను సేకరించాలి. వీటిని సోఫా లేదా దివాన్‌ వెనుక గోడపై ఒకదాని కింద ఒకటి, పక్కగా అమరుస్తూ, మొత్తమంతా ఒక పెద్ద ఫ్రేముగా కనిపించేలా సర్దితే చాలు. గోడ వర్ణాన్ని బట్టి మ్యాచింగ్‌గా అన్నింటికీ ఒకే రంగు లేదా రెండు మూడు రంగులను వేస్తే ఆకర్షణీయంగా అనిపిస్తుంది. హాల్‌లోని ఫర్నిచర్‌ వర్ణంలోనే ఇవి కూడా ఉండేలా చేస్తే గదికి కొత్త అందం వచ్చినట్లే.

మొక్కలతో.. పడకగదిలో ఖాళీ ఫ్రేముల మధ్య మొక్కలు ఉండేలా అమరిస్తే ఆ అందమే వేరు. ముందుగా దీర్ఘ చతురస్రాకారంలో పెద్దది, చతురస్రాకారంలో ఉన్న రెండు చిన్న ఫ్రేములను ఎంచుకోవాలి. మొదట పెద్ద ఫ్రేమును గోడకు అంటించాలి. దానికి పైన, కింద మిగతా రెండు ఫ్రేములను అమర్చాలి. ప్రతి దానికీ మధ్యలో సరిపోయేలా చిన్న చెక్కముక్కలను కొట్టి, ఇండోర్‌ మొక్కల కుండీలను సర్దేయొచ్చు. లేదా ఒక దాంట్లో మొక్కను, మిగతా వాటిలో  అలంకరణ వస్తువులను అమర్చినా గదికి అందాన్ని తెచ్చిపెడతాయి. .

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్