అబద్ధాలతో సెలవా?

ఉద్యోగం అనేది ఆర్థిక వెసులుబాటు కోసమే కాదు.. అది మనకెంతో సంతోషాన్నిస్తుంది. గుర్తింపుని తెస్తుంది. అన్నింటినీ మించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అంత ముఖ్యమైన కొలువులో మరింత ఉన్నతి సాధించేందుకు ఈ సూత్రాలు పాటించి చూడండి...

Published : 17 Apr 2022 02:49 IST

ఉద్యోగం అనేది ఆర్థిక వెసులుబాటు కోసమే కాదు.. అది మనకెంతో సంతోషాన్నిస్తుంది. గుర్తింపుని తెస్తుంది. అన్నింటినీ మించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అంత ముఖ్యమైన కొలువులో మరింత ఉన్నతి సాధించేందుకు ఈ సూత్రాలు పాటించి చూడండి...

* ఉద్యోగం మొక్కుబడి వ్యవహారంగా మారకుండా చూసుకోండి. అంటే అందులో నిమగ్నమై ఇష్టంగా చేయండి. జీవితంలో ఏ ఒక్కటీ పూలబాటలా సాఫీగా సాగిపోదు. అది ఉద్యోగానికీ వర్తిస్తుంది. ఏదో రూపంలో ఆటంకాలూ అవరోధాలూ ఎదురుకావచ్చు. వాటిని తెలివిగా దాటుకుంటూ వెళ్లాలే కానీ బాధపడుతూ కుంగుబాటుకు లోనవ్వొద్దు.
* ఉన్నాయి కదాని అబద్ధపు కారణాలతో సెలవులు తీసుకోవద్దు. నూటికి రెండుసార్లు అసలైన నిజం చెప్పడం కుదరకపోవచ్చు.. కానీ మిగిలిన అన్నిసార్లూ నిక్షేపంగా చెప్పవచ్చు. అదే మీపట్ల సదభిప్రాయాన్ని పెంచుతుంది. పురుషులతో పోలిస్తే స్త్రీలకు బాధ్యతలు ఎక్కువ కనుక పిల్లల కోసం, వృద్ధురాలైన అత్తగారి కోసం సెలవు పెట్టాల్సి వస్తుంది. ఆ విషయాన్ని నిజాయతీగా చెబితే అధికారులు తప్పకుండా అర్థం చేసుకుంటారు.
* తోటి ఉద్యోగులతోనో, పై అధికారులతోనో ఏదైనా పేచీ వస్తే ఆ విషయాన్ని వారితోనే చర్చించండి. విషయం తేటతెల్లమవుతుంది. అంతే తప్ప కోపతాపాలతో ఉద్యోగం మారాలనుకోవడం లేదా అశాంతిని కొనితెచ్చుకోవడం చేయొద్దు.
* ఉద్యోగాన్ని ఇష్టపడుతూ లీనమై చేయాల్సిందే! అయితే చిన్న చిన్న విరామాలు కూడా తీసుకోవాలి. ఆ ఒకటి రెండు నిమిషాల్లో మెడ, నడుము వ్యాయామం చేయండి. కండరాలు పట్టేయడం, ఆర్థరైటిస్‌ లాంటి సమస్యలకు విరుగుడుగా పనిచేస్తుంది.
* మీ కష్టాన్ని గుర్తించడం లేదని కానీ, తగిన ఫలితం రావడంలేదని కానీ నిరాశ చెందొద్దు. మన పని, ఆలోచనాతీరూ ఎన్నటికీ వృథా కాదు. ఒక్కోసారి ఆలస్యం కావచ్చు.. కానీ ఫలితం తప్పకుండా దక్కుతుంది.
* ప్రతిచోటా ఉన్నట్టే కార్యాలయాల్లోనూ చెప్పుడు మాటలు చెప్పేవారు ఉంటారు. వాళ్లకి దూరంగా ఉండండి. ఒకరి మీద మీకు చెప్పినట్టే మీమీద కూడా ఇతరులకు చెత్త కబుర్లు చెబుతారని మర్చిపోవద్దు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్