చూపులతో చంపేస్తున్నాడు!

నాదో విచిత్ర సమస్య. ఆఫీసులో కొత్తగా చేరిన జూనియర్‌ నన్నలా చూస్తూనే ఉంటాడు. నాకంటే చాలా చిన్నవాడు. ఎక్కడికి వెళ్లినా ఏదో మూల నుంచి అతను నన్నే చూస్తుండటం గమనించా. పొరబాటున తనవైపు నేను చూసినా నేను కళ్లు తిప్పుకోవాల్సిందే కానీ..

Updated : 20 Apr 2022 14:29 IST

నాదో విచిత్ర సమస్య. ఆఫీసులో కొత్తగా చేరిన జూనియర్‌ నన్నలా చూస్తూనే ఉంటాడు. నాకంటే చాలా చిన్నవాడు. ఎక్కడికి వెళ్లినా ఏదో మూల నుంచి అతను నన్నే చూస్తుండటం గమనించా. పొరబాటున తనవైపు నేను చూసినా నేను కళ్లు తిప్పుకోవాల్సిందే కానీ.. తను మాత్రం ఆపడం లేదు. సహోద్యోగి నన్ను చూస్తున్నాడని ఫిర్యాదు చేయలేను. అది తప్పు కిందకీ రాదు. కానీ ఇబ్బందిగా ఉంది. ఏం చేయను?

- ఓ సోదరి

నిజమే.. మీరు చెప్పినట్టు చూడటం తప్పుకాదు. అదే మీరు నెట్‌ఫ్లిక్స్‌ లాంటి పెద్ద టెక్‌ సంస్థలో చేస్తుండుంటే మాత్రం ఇది తప్పే. అక్కడ వేధింపుల నివారణ చర్యల ప్రకారం మహిళల్ని ఎవరైనా అయిదు సెకన్లకన్నా ఎక్కువ సమయం చూస్తే ఇబ్బంది పెట్టినట్టే లెక్క. ఆ అబ్బాయి తీరు అసహజంగా తోస్తే.. అతని మేనేజర్‌ని అనధికారికంగా కలవండి. అతనలా చూస్తోంటే ఇబ్బందికరంగా ఉందని చెప్పండి. ఇలాంటి పరిస్థితుల్ని చర్చించడమే సమంజసం. దీని తర్వాతా అతని తీరులో మార్పు రాకపోతే.. తనతోనే మాట్లాడండి. కొందరు ఇతరులతో కలవడానికి ఇబ్బంది పడుతుంటారు. దీంతో వాళ్లకే తెలియకుండా అలా చూస్తూ ఉంటారు. మీరు కదిలిస్తే తనకీ అవగాహన వస్తుంది. ఒకవేళ రాకపోయినా మీకు నచ్చదన్న విషయం తెలుస్తుంది. దీంతో తీరు మార్చుకుంటారు. ఈ ప్రయత్నాల తర్వాతా పరిస్థితిలో మార్పు రాకపోతే, హెచ్‌ఆర్‌ విభాగం సాయం కోరండి. వాళ్లే మీకు సాయం చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని