Published : 22/04/2022 00:33 IST

పోటీ అవసరం..

ఇల్లు చక్కబెట్టుకుంటూ వృత్తి ఉద్యోగాల్లో రాణించడం కొంచెం కష్టమే. కానీ ఆ కష్టాన్ని అధిగమించేందుకు ఈ సూత్రాలు ఉపయోగపడతాయి..

* చేస్తున్న పనిలో అనుభవం ఉంది, అంతా తెలుసు అని అనుకోవద్దు. అలా అనుకున్నామంటే ఎదుగుదల ఆగిపోయినట్టే. మీ రంగంలో వచ్చే మార్పులు వంట బట్టించుకోండి. అవసరమైతే కోర్సులు చేయండి.

* వాయిదాలొద్దు. రేపు అనుకున్నది ఈరోజే.. ఇవాళ అనుకున్నది ఈ క్షణమే అమలుపరచండి. విజయ సోపానాల్లో ఇది మొదటి మెట్టు.

* మీకు మీరు ఆరు నెలల్లో ఇంత సాధించాలి, ఏడాదిలో ఫలానా మైలురాయికి చేరాలి- తరహాలో కొన్ని టార్గెట్లు పెట్టుకోండి. ఆ గమ్యాలు చేరే దిశగా మీ ఆలోచనలూ ఆచరణా ఉండాలి.

* పోటీ అవసరం. మనకంటే వెనకబడిన వాళ్లతో పోల్చుకుని సంతృప్తిపడితే లాభంలేదు. ముందున్న వాళ్లతో పోటీ పెట్టుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని