సౌందర్య మంత్రాలు... సుగంధ ద్రవ్యాలు

వ్యాధినిరోధక శక్తి పుష్కలంగా ఉండే సుగంధ ద్రవ్యాలు వంట రుచిని పెంచడమే కాదు.. అందాన్ని పరిరక్షించడంలోనూ ముందుంటాయంటున్నారు సౌందర్య నిపుణులు. వీటిలోని పోషకవిలువలు ముఖచర్మాన్ని

Updated : 27 Apr 2022 04:21 IST

వ్యాధినిరోధక శక్తి పుష్కలంగా ఉండే సుగంధ ద్రవ్యాలు వంట రుచిని పెంచడమే కాదు.. అందాన్ని పరిరక్షించడంలోనూ ముందుంటాయంటున్నారు సౌందర్య నిపుణులు. వీటిలోని పోషకవిలువలు ముఖచర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయంటున్నారు.

లవంగాలు... చెంచా కొబ్బరినూనెలో మూడు లేదా నాలుగుచుక్కల లవంగ నూనె కలిపి ముఖానికి మర్దన చేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రపరిస్తే, చర్మంలోని మురికి బయటకు పోయి మెరుపులీనుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ వృద్ధాప్య ఛాయలను త్వరగా దరికి చేరనివ్వదు.

యాలకులు... యాంటీ బ్యాక్టీరియా గుణాలుండే యాలకుల పొడి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చెంచా పొడికి తేనె కలిపి ముఖానికి రాస్తే, మొటిమలు, మచ్చలు దూరమవుతాయి.  నిద్రపోయే ముందు ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఉదయం శుభ్రం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలర్జీ సమస్యలుండవు.  

బిర్యానీ ఆకు.. గుప్పెడు ఆకులను కప్పు నీటిలో వేసి అయిదు నిమిషాలు మరగించి వడకట్టి చల్లార్చాలి. దీన్ని పొడి సీసాలో నింపి ఫ్రిజ్‌లో ఉంచి టోనర్‌గా వినియోగించొచ్చు. ఈ నీటిలో ముంచిన దూది ఉండతో ముఖాన్ని మృదువుగా రుద్ది ఎండవల్ల ఏర్పడిన మచ్చలను పోగొట్టుకోవచ్చు.

జాజికాయ పొడి.. చెంచా జాజికాయ పొడికి అరచెక్క నిమ్మరసం, అరచెంచా పెరుగు కలిపిన మిశ్రమాన్ని ముఖానికి లేపనంలా రాయాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరిచి మాయిశ్చరైజర్‌ అప్లై చేయాలి. ఇలా చేస్తే పిగ్మెంటేషన్‌ మచ్చలు పోతాయి. ఎండవల్ల కమిలిన చర్మాన్ని యథాస్థితికి తెచ్చుకోవచ్చు. మొటిమలు, మచ్చలు దూరమై, ముఖచర్మం ఆరోగ్యంగా మారుతుంది.    

దాల్చినచెక్క... చెంచా చొప్పున తేనె, మెత్తని దాల్చిన చెక్క పొడి కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో కడగాలి. ఇది చర్మానికి సాగే గుణాన్ని అందించే కొల్లాజెన్‌ ఉత్పత్తిలో సాయపడి, మృదువుగా, మెరిసేలా చేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్