Published : 29/04/2022 01:55 IST

కెరియర్‌... కాస్త భద్రం!

కొత్తగా ఉద్యోగంలోకి చేరినా, ఏళ్లుగా పని చేస్తున్నా... ఎవరైనా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన, అలవాట్లు, చేసే పొరపాట్ల వల్ల కెరియర్‌లో ఇబ్బందులు ఎదురు కావొచ్చు.

నియమాలను ఉల్లంఘించడం... ప్రతి కార్యాలయానికీ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వీటిని ఉల్లంఘించడం మీ మనుగడకు ప్రమాదమే.

మార్పును అంగీకరించకపోవడం... చాలామంది ఇచ్చిన పనిని పూర్తి చేశామా లేదా అనే ఆలోచిస్తారు. కానీ కొత్త ఆలోచనలు చేయడంలో విఫలమవుతారు. ఇది కూడా ఉన్నచోట ఉంచేస్తుంది.

అనవసర భయాలు: భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతూ వర్తమానంలో చేసే పనిపై సరిగా దృష్టి పెట్టకపోవడం.

అంటీముట్టక... తోటి ఉద్యోగులతో కలవకుండా దూరంగా ఉండటం మంచి పద్ధతి కాదు. అందరూ కలిసి సమష్టిగా పనిచేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నది గుర్తుంచుకోవాలి.

ధైర్యం,  చొరవ లేకపోవడం... సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం ఉద్యోగోన్నతిలో అవరోధాలను సృష్టిస్తుంది.

అల్పసంతోషం... చిన్న పనులకే బాగా చేశానని తృప్తి చెందితే ఎదుగుదల అక్కడితో ఆగిపోతుంది. నిత్య విద్యార్థిలా నేర్చుకుంటూనే ఉండాలి. లేదంటో ఎదుగుదల ఆగిపోతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని