అందరి ముందూ.. ఎంత అవమానం!
చేస్తున్న సంస్థలోనే కొత్త ఉద్యోగం వచ్చింది. మారే ప్రక్రియంతా హెచ్‌ఆర్ విభాగం చూసుకుంటానంది. దీంతో నోటీస్ పిరియడ్‌కు అవకాశం లేకుండా పోయింది. తీరా మారే ముందు రిలీవ్ చేయమని మా బాస్‌కి మెయిల్ పెట్టా. ఆయనేమో
చేస్తున్న సంస్థలోనే కొత్త ఉద్యోగం వచ్చింది. మారే ప్రక్రియంతా హెచ్‌ఆర్ విభాగం చూసుకుంటానంది. దీంతో నోటీస్ పిరియడ్‌కు అవకాశం లేకుండా పోయింది. తీరా మారే ముందు రిలీవ్ చేయమని మా బాస్‌కి మెయిల్ పెట్టా. ఆయనేమో నోటీస్ ఇవ్వలేదని సుదీర్ఘమైన సమాధానం ఇచ్చారు. ఒకరకంగా నేను తలదించుకునేలా ఉందది. పైగా బృందంలో అందరికీ కాపీ పెట్టారు. అవమానంతో తలకొట్టేసినట్లయింది. హెచ్‌ఆర్ వాళ్లు చెప్పిన పనే కదా నేను చేసింది. పని చేసేది ఒకే చోట... ఏదో ఒక సందర్భంలో ఎదురుపడతాం. ఎంత చిన్నతనం! ఇప్పుడు నేనేం చేయను? జరిగిన విషయాన్నే చెప్పనా? వదిలేయనా?
- ఓ సోదరి
ఎంత దారుణం! ఆయన మెయిల్ పంపే ముందు వాళ్లందర్నీ తొలగించాల్సింది. సరే.. ఇప్పుడు.. ‘థాంక్యూ బాస్, మీకు వీలున్నప్పుడు సమయమిస్తే దీనిపై చర్చిద్దాం’ అని అందరికీ రిప్లై వెళ్లేలా మెయిల్ పంపండి. దీంతో పరిస్థితిని మీరు ఎదుర్కోగలరు, పారిపోవట్లేదన్న సంకేతాన్ని ఇచ్చినవారవుతారు. ఆయన సమయం ఇచ్చినపుడు వెళ్లి జరిగినదంతా చెప్పండి. అలాగే హెచ్‌ఆర్ విభాగాన్నీ కలిసి ఉద్యోగ మార్పిడి ప్రక్రియ గురించి చర్చించండి. ఇప్పటికే మీ పాత బాస్ ఈ విషయంగా అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి, వీలైనంత జాగ్రత్తగా ఎలా ప్రక్రియ పూర్తి చేయొచ్చో తెలుసుకోండి. ఈ స్థితిలోంచి మీకు మీరే బయటపడాలి. ఇదో సవాలు కూడా. స్వయంగా ప్రయత్నించి చూడండి.. మీరెంత దృఢమైన వ్యక్తో మీకూ, తద్వారా ఇతరులకూ అర్థమవుతుంది. ఆల్ ద బెస్ట్.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.