పార్ట్‌టైం ఉద్యోగం మంచిదే...

రాశి డిగ్రీ రెండో సంవత్సరం చదువుతూనే పార్ట్‌టైం ఉద్యోగంలో చేరింది. అహల్యకు పిల్లలు పుట్టడంతో ఇంటి నుంచి పార్ట్‌టైంగా పని చేస్తోంది. ఇలా  చేసే ఉద్యోగాలు పలురకాల అదనపు నైపుణ్యాలను అందిస్తాయంటున్నారు కెరియర్‌ నిపుణులు. 

Updated : 15 May 2022 05:12 IST

రాశి డిగ్రీ రెండో సంవత్సరం చదువుతూనే పార్ట్‌టైం ఉద్యోగంలో చేరింది. అహల్యకు పిల్లలు పుట్టడంతో ఇంటి నుంచి పార్ట్‌టైంగా పని చేస్తోంది. ఇలా  చేసే ఉద్యోగాలు పలురకాల అదనపు నైపుణ్యాలను అందిస్తాయంటున్నారు కెరియర్‌ నిపుణులు. 

చదువుకొనేటప్పుడు అమ్మానాన్నలిచ్చే పాకెట్‌మనీ ఒక్కో సారి సరిపోదు. పుస్తకాలు కొనుక్కోవడానికి లేదా స్నేహితులతో సరదాగా సినిమాకు వెళ్లాలన్నా చేతిలో ఎంతో కొంత ఉండాల్సిందే. దీనికోసం ఇంట్లో ఇబ్బంది పెట్టడం కన్నా, సొంతగా సంపాదించుకోగలిగితే ఆ సంతోషమే వేరు. ఖర్చులకు వెతుక్కోవడం లేదా స్నేహితుల వద్ద చేబదుళ్ల అవసరం ఉండదు. అంతేకాదు, రూపాయి విలువా తెలుస్తుంది. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. మనీ మేనేజ్‌మెంట్, సమయ పాలనపై అవగాహన పెరుగుతాయి. అవసరాలకు తగినట్లుగా బడ్జెట్‌ వేసుకోవడం అలవడుతుంది. చదువు పూర్తయ్యే సరికి ఉద్యోగ అనుభవమూ వస్తుంది. ఇతరులతో కలిసి పని చేయడం నేర్చుకోవచ్చు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ నైపుణ్యాలన్నీ భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయి.

ఇంటి నుంచి... కెరియర్‌లో విరామంతో ప్రొఫెషనల్‌ వర్క్‌కు దూరం కావాల్సి వస్తుంది. అలాకాకుండా రోజులో కనీసం మూడునాలుగు గంటలైనా వర్క్‌ చేసేలా పార్ట్‌టైం ఉద్యోగాన్ని ఎంచుకుంటే పనికి దగ్గరగా ఉంటాం. ఇలా ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌ను పెంచుకోవచ్చు. ఏ పనీ లేదనే న్యూనత నుంచి బయటపడొచ్చు. ఇది మానసిక ఆరోగ్యాన్నీ పెంపొందిస్తుంది. ప్రస్తుత సాంకేతిక విధానాలపై అవగాహన కలుగుతుంది. అవసరమైతే ఆన్‌లైన్‌లో కొత్త కోర్సులు చేస్తే సెకండ్‌ ఇన్నింగ్స్‌కి ఉపయోగకరంగా ఉంటాయి. కొందరికి ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉన్నా బాధ్యతల కారణంగా వీలు పడకపోవచ్చు. ఇటువంటి వారు ఇంటి నుంచి ఈ తరహా ఉద్యోగంలోకి అడుగుపెడితే తృప్తిగానూ ఉంటుంది. ఆ తర్వాత బయటికి వెళ్లి ఉద్యోగం చేయడానికి తగిన అనుభవాన్ని, అర్హతను పొందొచ్చు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్