Published : 16/05/2022 01:49 IST

చదువొక్కటే చాలదు!

కష్టపడి చదవడం అనగానే అమ్మాయిలే ఎక్కువ గుర్తొస్తారు. కానీ ఎంత మంచి పర్సంటేజీలు సాధించినా కొందరు ఉద్యోగాల విషయానికొచ్చేసరికి వెనుకబడుతుంటారు. కారణమేంటి అంటే.. ప్రాక్టికల్‌ పరిజ్ఞానం లేకపోవడమే అంటున్నారు నిపుణులు. సాయపడే సూచనలిస్తున్నారిలా..!

* పుస్తకం బోలెడు సమాచారాన్ని అందిస్తుంది. కానీ దాని ఉపయోగం నిజజీవితంలో ప్రయత్నిస్తేనే కదా తెలిసేది! ఇదేమో అన్ని సార్లూ సాధ్యం కాదు. అందుకే మెంటార్లను ఏర్పరచుకోవాలి. లెక్చరర్లు, పరిశ్రమలో నిలదొక్కుకున్న వాళ్లు ఇలా ఎవరినైనా మెంటార్‌గా ఎంచుకోవచ్చు. వీళ్ల అనుభవం, ఒక్కో పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నారు వంటివన్నీ మీకు పాఠాలే. ్య కెరియర్‌లో ముందకెళ్లడానికి అదే రంగంలోని వారితో స్నేహం మామూలే. కానీ వేరే రంగాల వారితోనూ మాట్లాడాలి. కొత్త విషయాలు తెలుస్తాయి. ఆలోచనా పరిధీ పెరుగుతుంది. ఒక విషయాన్ని భిన్న కోణాల్లో ఆలోచించడమెలాగో అర్థమవుతుంది. అయితే ఎక్కువగా వినడానికి ప్రాధాన్యమివ్వాలి.
* చాలావరకూ ప్రాజెక్టు, డిబేట్‌ వగైరా ఉంటే.. బాగా తెలిసిన అంశాన్ని ఎంచుకుంటాం. ఈసారి కష్టమైన దాన్ని ప్రయత్నించండి. రిస్క్‌ అనుకోవద్దు. విద్యార్థి దశలో రిస్క్‌ తీసుకోకపోతే ఇంకెప్పుడు తీసుకుంటారు? తెలియని అంశం మీ సామర్థ్యానికి సవాలు లాంటిది. ఇక్కడ ఆ విషయాన్ని తెలుసుకోవడమే కాదు.. తెలుసుకునే క్రమంలో దాటిన దశలు, పరిచయాలు.. అన్నీ కెరియర్‌ను ముందుకు నడిపేవే.
* అమ్మాయిలు అనేసరికి ఎక్కడికైనా పంపాలంటే కంగారు. దీంతో ఇంటర్న్‌షిప్‌, ప్రాజెక్టు వంటివన్నీ తెలిసిన వాళ్ల ద్వారా ఇప్పించడమో, దగ్గరుండి తీసుకెళ్లడమో చేస్తుంటారు. జాగ్రత్త మంచిదే! అయితే అది మిమ్మల్ని బంధించేయకూడదు. ప్రయత్నమేదైనా సొంతంగా చేయండి. కొత్త ప్రాంతంలో ఇంటర్న్‌షిప్‌ ప్రయత్నించండి. కొత్త మనస్తత్వాలు, అన్ని పనులూ సొంతగా చేసుకోవాల్సి రావడం వంటివన్నీ తెలుస్తాయి.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి