సొంతంగా నిర్ణయాలు తీసుకోండి

నా వయసు 25. నాకు సంబంధాలు చూస్తుండగా మా పిన్ని ప్రైవేట్‌ స్కూల్లో పనిచేస్తున్న టీచర్‌ని  పరిచయం చేసింది. అతను పెళ్లి చూపుల్లోనే నన్నెంతో ఇష్టపడినా మా వాళ్లు అతని కన్నా మేలని మరో వ్యక్తితో పెళ్లి చేశారు. నా భర్తేమో

Updated : 16 May 2022 12:46 IST

నా వయసు 25. నాకు సంబంధాలు చూస్తుండగా మా పిన్ని ప్రైవేట్‌ స్కూల్లో పనిచేస్తున్న టీచర్‌ని  పరిచయం చేసింది. అతను పెళ్లి చూపుల్లోనే నన్నెంతో ఇష్టపడినా మా వాళ్లు అతని కన్నా మేలని మరో వ్యక్తితో పెళ్లి చేశారు. నా భర్తేమో ఏడాదికే చనిపోయాడు. ఇప్పుడు నా జీవితం తారుమారైంది. మొదటి వ్యక్తి కాదనుకున్నందుకే ఇదంతా జరిగిందా అనిపిస్తోంది. ఓవైపు బాధ, మరోవైపు మా పిన్ని నాతో మాట్లాడటం మానేసింది. నా జీవితం ఎటుపోతోందో అర్థమవడం లేదు. సలహా చెప్పండి.

ముందుగా మన చేతిలో లేనివాటి గురించి దిగులుపడి ప్రయోజనం లేదని గుర్తించండి! ఇందులో మీరు చేసిందేమీ లేదు. గతం ఎటూ తిరిగిరాదు. కానీ అదే తలచుకుంటూ ప్రస్తుత సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. జరిగిందేదో జరిగింది అనుకుని మీ పిన్నిని కలిసి, మనసులో ఉన్న ఆలోచనలన్నీ పంచుకోండి. ఆమె అర్థంచేసుకుని, అవకాశం ఉంటే మీకు తగిన మరో వ్యక్తిని సూచించగలుగుతారు. అదలా ఉంచి భర్త చనిపోయినంతలో ఇక జీవితం లేదనుకోవద్దు. దుఃఖంతో కాలం గడిపే బదులు మీ చదువూ సామర్థ్యాలకు తగిన ప్రణాళికలు వేసుకుని ఆత్మీయుల సహాయం తీసుకోండి. ఇకపై ఒకరు బాధపడతారేమోనని తొందరపాటుతో ఏదీ చేయొద్దు. నూటికి నూరు శాతం మీ మనసు అంగీకరించినప్పుడే సొంతంగా నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు ఫలితం ఎలా ఉన్నా బాధ్యత తీసుకోగలుగుతారు, పర్యవసానాలను ఎదుర్కోగలుగుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని