ఆమెకు నో చెప్పడమెలా?
నేనో ట్యుటోరియల్ సెంటర్ నిర్వహిస్తున్నా. విస్తరణలో భాగంగా ఇద్దరు ఉద్యోగులను తీసుకోవాలనుకుంటున్నా. కొవిడ్ తర్వాత అంతా ఆన్‌లైన్ అయినా... ట్యూషన్స్ ఆఫ్‌లైన్లోనూ బాగానే సాగుతున్నాయి. సమస్యల్లా నాకు మేనేజ్‌మెంట్ వ్యవహారాలు పెద్దగా తెలియవు. ఇదో సవాలే నాకు. మా వదిన అడ్మిన్ స్థానాన్ని నాకివ్వు, చూసుకుంటానంటోంది. కానీ నాకది ఇష్టం లేదు. తను
నేనో ట్యుటోరియల్ సెంటర్ నిర్వహిస్తున్నా. విస్తరణలో భాగంగా ఇద్దరు ఉద్యోగులను తీసుకోవాలనుకుంటున్నా. కొవిడ్ తర్వాత అంతా ఆన్‌లైన్ అయినా... ట్యూషన్స్ ఆఫ్‌లైన్లోనూ బాగానే సాగుతున్నాయి. సమస్యల్లా నాకు మేనేజ్‌మెంట్ వ్యవహారాలు పెద్దగా తెలియవు. ఇదో సవాలే నాకు. మా వదిన అడ్మిన్ స్థానాన్ని నాకివ్వు, చూసుకుంటానంటోంది. కానీ నాకది ఇష్టం లేదు. తను చేయలేదని కాదు. కుటుంబ సభ్యులను భాగం చేసుకోవడం ఇష్టం లేదంతే! తనకు కుదరదని చెప్పేదెలా? అసలు నా నిర్ణయం సరైనదేనా?
- ఆశా
కుటుంబ సభ్యులతో కలిసి పనిచేయడం, వ్యాపారపరంగా కలిసి సాగడం కొంత కష్టమే. కాబట్టి, మీ నిర్ణయం సరైనదే అని చెబుతా. అసలే సంస్థ నిర్వహణ మీకు కొత్త. మీరెవరిని ఎంచుకున్నా బోలెడు సవాళ్లు ఎదురవుతుంటాయి. ఎప్పుడు అధికారం చూపించాలి, ఎప్పుడు వెనక్కి తగ్గాలి, ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం, సమస్యల్ని సున్నితంగా చెప్పడం, కొన్నింటిని చూసీచూడనట్లు వదిలేయడం.. లాంటివి బోలెడుంటాయి. ఇవన్నీ నేర్చుకోవడంలో మీరే కాస్త తడబడుతుంటారు. అలాంటిది ఆత్మీయులు ఉంటే.. గట్టిగా చెప్పలేరు. చెబితే మనస్పర్థలు. ఇక తీసేయాల్సిన పరిస్థితే వస్తే? మీరెలాగూ వ్యక్తిగతంగా ఆమెను తిరస్కరించట్లేదు. కాబట్టి... ‘అడక్కుండానే ముందుకొచ్చినందుకు థాంక్స్. కానీ దీని కారణంగా మన మధ్య విభేదాలు వచ్చే అవకాశాన్నివ్వడమూ నాకు ఇష్టం లేదు’ అని చెప్పండి. అవతలివాళ్లు.. ‘అలాంటివేమీ రావు.. వచ్చినా సర్దుకుందా’మంటూ నచ్చజెప్పొచ్చు. ‘దీన్ని బలంగా నిర్ణయించుకున్నా. భవిష్యత్తులో నిర్ణయం మార్చుకుంటే ముందు నిన్నే సంప్రదిస్తా’ అని కచ్చితంగా చెప్పేయండి. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలంటారు కదా. భవిష్యత్తులో బాధపడటం కంటే.. ఇప్పుడే దృఢంగా ఉండాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.