శిరోజాలకు పరిమళం..

వేసవిలో చెమటతో జుట్టు తడిసి ముద్దవుతుంది. ఫలితంగా చుండ్రు, దురదతోపాటు వాసన. దీన్నుంచి రక్షణకు కొన్ని పరిమళ ద్రవ్యాలను తయారు చేసుకోవచ్చు. ఇవి శిరోజాలను తాజాగా ఉంచి, సువాసననూ ఇస్తాయి. పైగా జుట్టునూ పరిరక్షిస్తాయంటున్నారు నిపుణులు.

Published : 18 May 2022 01:33 IST

వేసవిలో చెమటతో జుట్టు తడిసి ముద్దవుతుంది. ఫలితంగా చుండ్రు, దురదతోపాటు వాసన. దీన్నుంచి రక్షణకు కొన్ని పరిమళ ద్రవ్యాలను తయారు చేసుకోవచ్చు. ఇవి శిరోజాలను తాజాగా ఉంచి, సువాసననూ ఇస్తాయి. పైగా జుట్టునూ పరిరక్షిస్తాయంటున్నారు నిపుణులు.  వాటి తయారీ ఎలాగో చూడండి...

గులాబీ రేకలతో.. రెండు గులాబీ పూల నుంచి రేకలను తీసి ఆరనిచ్చి పొడి చేయాలి. మరో గులాబీ రేకలను విడిగా తీసి ఉంచాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి పావు లీటరు నీళ్లు పోయాలి. అవి వేడెక్కాక గులాబీ రేకలను వేసి చిన్నమంట మీద బాగా మరగనివ్వాలి. గులాబీలో ఉండే ఎసెన్స్‌ పూర్తిగా నీటిలో దిగుతుంది. ఇందులో గులాబీ రేకల పొడిని రెండు చెంచాలు వేసి పావుగంట బాగా మరిగించి వడ కట్టాలి. ఇందులో చెంచా కలబంద గుజ్జు, అయిదు చుక్కల లావెండర్‌ నూనె, అరచెంచా రోజ్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ వేసి మరోసారి కలిపి స్ప్రే సీసాలో భద్రపరుచుకోవాలి. బయటికి వెళ్లేటప్పుడు జుట్టుకు దీన్ని స్ప్రే చేసుకుంటే చాలు. రోజంతా శిరోజాలను తాజాగా ఉంచడమే కాకుండా కాలుష్యం నుంచీ  కాపాడుతుంది. మాడును ఆరోగ్యంగా ఉండేలానూ చేస్తుంది.

నారింజతో.. అరకప్పు గులాబీ నీళ్లలో 15 చుక్కల గులాబీ నూనె, అయిదారు చుక్కల నారింజ నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే సీసాలో నింపి బాగా షేక్‌ చేసి చల్లని ప్రదేశంలో భద్రపరచాలి. తలస్నానం చేసి,  బయటకు వెళ్లేటప్పుడు జుట్టుకు స్ప్రే చేసుకుంటే చాలు. శిరోజాలకు పరిమళం వ్యాపిస్తుంది. మాడుపై మురికీ పేరుకోదు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్