పాదాలకూ కావాలి సౌందర్యం

ముఖానికి మేకప్‌, నచ్చిన దుస్తులు, మ్యాచింగ్‌ పాదరక్షలంటూ ఎంత శ్రద్ధగా తయారైనా అందవిహీనంగా ఉన్న పాదాలు అలంకరణనంతటినీ క్షణంలో తీసిపారేస్తాయి. అందుకే పాదాలే కదా అని అశ్రద్ధ చేయకుండా వాటినీ మరింత అందంగా, ఆరోగ్యంగా మార్చుకోవాలంటున్నారు సౌందర్యనిపుణులు.

Updated : 20 May 2022 00:32 IST

ముఖానికి మేకప్‌, నచ్చిన దుస్తులు, మ్యాచింగ్‌ పాదరక్షలంటూ ఎంత శ్రద్ధగా తయారైనా అందవిహీనంగా ఉన్న పాదాలు అలంకరణనంతటినీ క్షణంలో తీసిపారేస్తాయి. అందుకే పాదాలే కదా అని అశ్రద్ధ చేయకుండా వాటినీ మరింత అందంగా, ఆరోగ్యంగా మార్చుకోవాలంటున్నారు సౌందర్యనిపుణులు.

కొందరు ముఖానికి స్క్రబింగ్‌, లైట్‌నింగ్‌ అంటూ మరింత మెరుపును తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అదే శ్రద్ధను పాదాలపై పెట్టకపోవడంతో అవి ఎబ్బెట్టుగా కనిపిస్తుంటాయి. వీటి పైనా వారానికొకసారి సమయాన్ని వెచ్చించగలిగితే చాలు. మృదువుగా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇందుకోసం పాదాలు మునిగేలా ఉండే చిన్న ప్లాస్టిక్‌ టబ్‌ను తీసుకొని అందులో నిండుగా గోరువెచ్చని నీటిని నింపాలి. అరచెక్క నిమ్మరసం, చెంచా వంటసోడా వేసి ఈ నీటిని బాగా కలిపి పాదాలను 10 నిమిషాలు నానబెట్టాలి. మెత్తని రాయితో అరికాళ్లను మృదువుగా రుద్ది, గోరువెచ్చని నీటితో కడిగి, పొడి వస్త్రంతో తుడవాలి.

స్క్రబింగ్‌.. చెంచా చొప్పున శనగపిండి, చక్కెర, కాఫీపొడిని ఓ గిన్నెలో తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమంలో అరచెక్క టమాటాను ముంచి ఆ పొడి అద్దుకునేలా చేయాలి. ఈ చెక్కతో పాదాలను మృదువుగా 10 నిమిషాలు స్క్రబ్బింగ్‌ చేసి కడిగి మెత్తని వస్త్రంతో తుడిచి ఆరనివ్వాలి.

మెరుపు కోసం.. ఒక బంగాళాదుంపను తురిమి రసం తీయాలి. ఈ రసానికి రెండు చెంచాల బియ్యప్పిండి, అరచెక్క నిమ్మరసం, అరచెంచా తేనె, చెంచా పెరుగు వేసి బాగా కలిపి పాదాలకు లేపనంలా రాయాలి. 20 నిమిషాలు ఆరనిచ్చి, మరో అయిదు నిమిషాలు మృదువుగా రుద్ది కడిగేయాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్‌ రాస్తే చాలు. మెరిసే పాదాలు మీ సొంతం. అప్పుడిక గోళ్లకు చక్కని నెయిల్‌పాలిష్‌ వేసి చూడండి. ఎంత చక్కగా ఉంటాయో!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్