ఇంటర్న్‌షిప్‌ అనుభవాలు పంచుకోండి!

మంజుల ఇంటర్న్‌షిప్‌ పూర్తయ్యి, ఇంటర్వూకి వెళ్తోంది. అక్కడ ఇంటర్న్‌షిప్‌ ధృవపత్రాలు ఇస్తే సరిపోతుందనుకుంది. దాంతో పాటు అక్కడి మీ అనుభవాలు, మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకున్న విధానాన్ని కూడా వివరిస్తే ఇంటర్వ్యూ చేసేవారికి అభ్యర్థి సామర్థ్యాలపై అవగాహన వస్తుందని అంటున్నారు నిపుణులు.

Updated : 21 May 2022 06:37 IST

మంజుల ఇంటర్న్‌షిప్‌ పూర్తయ్యి, ఇంటర్వూకి వెళ్తోంది. అక్కడ ఇంటర్న్‌షిప్‌ ధృవపత్రాలు ఇస్తే సరిపోతుందనుకుంది. దాంతో పాటు అక్కడి మీ అనుభవాలు, మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకున్న విధానాన్ని కూడా వివరిస్తే ఇంటర్వ్యూ చేసేవారికి అభ్యర్థి సామర్థ్యాలపై అవగాహన వస్తుందని అంటున్నారు నిపుణులు.

ఇంటర్న్‌షిప్‌లో అనుభవంతోపాటు, ఇది అనుకున్న కెరియర్‌లోకి అడుగుపెట్టడానికి మనల్ని అన్ని విధాలా సిద్ధం చేస్తుంది. కాలేజీ చదువు ముగించి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టే ముందు విద్యార్థులకు ఈ ఇంటర్న్‌షిప్‌ ఓ వేదికలా ఉపయోగపడుతుంది. వ్యాపారాభివృద్ధికి సంబంధించిన అంశాలపై అవగాహన అందిస్తుంది. ఇలా సంపాదించిన మీ అనుభవాలను ఇంటర్వ్యూలో వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చదువు మాత్రమే కాకుండా ఉద్యోగరంగంలోనూ అవగాహన కూడా పొందారని తెలియజేయాల్సి ఉంది.

ఆత్మవిశ్వాసంతో..

కార్పొరేట్‌ సంస్థలోనే కాకుండా ఇంటర్న్‌షిప్‌కు ఏదైనా స్టార్టప్‌ను మీరెంచుకుని పూర్తి చేస్తే దానివల్ల పొందిన ప్రయోజనాలను వివరించగలగాలి. అక్కడ బృందంతో కలిసి పని చేయడం, ఛాలెంజ్‌లను ఎదుర్కొంటూ పరిష్కారదిశగా అడుగు లేయడం, కొత్తవాళ్లతో కూడా చేయి కలిపి ఆత్మవిశ్వాసంతో మాట్లాడటం వంటివి మీరెలా నేర్చుకున్నారో చెప్పొచ్చు. మీ సామర్థ్యాలను పెంచుకోవడానికి ఇదెలా ఉపయోగపడిందో తెలియజేయాలి. స్టార్టప్‌ని అభివృద్ధి దిశగా నడిపించడానికి ఎటువంటి ప్రణాళికలు వేయాలి వంటి విషయాల్లో మీరు పొందిన అవగాహనా అంశాలను ఇంటర్వ్యూలో చెబితే చాలు. మీకు అప్పజెప్పే బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలరనే నమ్మకం వారికి వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్