మీ బ్రాండ్‌ విలువ పెంచుకోండి..!

మాట్లాడకూడదు, మన పని మాత్రమే మాట్లాడాలి.. అనుకుంటారు చాలామంది మహిళలు. పై అధికారులే తమ పనిని గుర్తించి పదోన్నతులు, ప్రోత్సాహకాలు ఇస్తారనుకుంటారు. ఇలా అనుకోవడమే ‘టియారా సిండ్రోమ్‌’. ఈ సిండ్రోమ్‌ కారణంగానే చాలామంది కెరియర్‌లో వెనకబడుతున్నారు. దీన్ని అధిగమించడానికి నిపుణులు చెప్పే సూచనలేంటంటే... 

Published : 02 Jun 2022 01:21 IST

మాట్లాడకూడదు, మన పని మాత్రమే మాట్లాడాలి.. అనుకుంటారు చాలామంది మహిళలు. పై అధికారులే తమ పనిని గుర్తించి పదోన్నతులు, ప్రోత్సాహకాలు ఇస్తారనుకుంటారు. ఇలా అనుకోవడమే ‘టియారా సిండ్రోమ్‌’. ఈ సిండ్రోమ్‌ కారణంగానే చాలామంది కెరియర్‌లో వెనకబడుతున్నారు. దీన్ని అధిగమించడానికి నిపుణులు చెప్పే సూచనలేంటంటే..

నిచేసే చోట వినయ విధేయతలు అవసరమే కానీ మీ పనితనం గురించి నలుగురిలో చెప్పుకోవడానికి జంకొద్దు. ముఖ్యంగా మీరు సాధించిన విజయాల్ని అవసరమైన చోట ప్రస్తావించండి. అది మీ వ్యక్తిగత బ్రాండ్‌ ప్రచారానికి ఉపయోగపడుతుంది. 
* అతి వినయం, బిడియం పనికిరావు. ‘నా గురించి మీకు తెలియందేముంది’ అని ప్రతిసారీ బాస్‌తో చెప్పి సరిపెట్టుకోకుండా, ఏ సందర్భంలో ఎలా స్పందించి ప్రాజెక్టులు పూర్తిచేశారో, అది కంపెనీకి ఎలా లాభపడిందో వీలున్నప్పుడల్లా చెబుతుండండి. 
* ఎవరు చురుగ్గా ఉంటారో, తరచూ తమ విజయాల్ని ప్రస్తావిస్తారో వాళ్లకే ముఖ్యమైన ప్రాజెక్టులూ వెళ్తుంటాయి. ఆ వెంటే పదోన్నతులూ. కాబట్టి వ్యక్తిగత బ్రాండ్‌ ప్రచారంలో మొహమాట పడొద్దు. 
* ‘నా సామర్థ్యం వాళ్లకి తెలుసు... వాళ్లే ప్రాజెక్టులు అప్పగిస్తారు’ అనుకోకుండా, ఏదైనా ముఖ్యమైన ప్రాజెక్టు చేసే సత్తా మీకు ఉందనుకుంటే మీరే చొరవ తీసుకుని అడగండి. 
* ఇదంతా ఒక్కరోజుతో వచ్చే మార్పు కాదు. మీలో మార్పు రావాలంటే నెట్‌వర్కింగ్‌ చాలా ముఖ్యం. అలాగే నమ్మకమైన మార్గదర్శినీ, రోల్‌మోడల్‌నీ ఎంచుకోండి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్