అతన్ని మార్చలేరు.. మీరే మారండి..

మా పెళ్లై ఏడేళ్లయింది. ఐదేళ్ల పాప ఉంది. మా వారు మహా కోపిష్టి. అతి చిన్న విషయానికి కూడా తిట్టేస్తుంటాడు. ఏది మాట్లాడాలన్నా భయంగానే ఉంటుంది. రోజురోజుకీ నా దుఃఖం ఎక్కువవుతోంది.

Published : 06 Jun 2022 01:24 IST

ప్రశ్న: మా పెళ్లై ఏడేళ్లయింది. ఐదేళ్ల పాప ఉంది. మా వారు మహా కోపిష్టి. అతి చిన్న విషయానికి కూడా తిట్టేస్తుంటాడు. ఏది మాట్లాడాలన్నా భయంగానే ఉంటుంది. రోజురోజుకీ నా దుఃఖం ఎక్కువవుతోంది. నేను సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో సలహా ఇవ్వండి.

- ఓ సోదరి

న్ని సంవత్సరాలుగా చూస్తున్నప్పుడు అతని ప్రవర్తన తీరు, దేనికెలా స్పందించేదీ మీకీపాటికి అర్థమై ఉంటుంది. ప్రతిదానికీ అతిగా స్పందిస్తూ అందరి మీదా కోపం చూపుతున్నారంటే అతనికి ఓర్పు లేదు, అందరినీ తప్పుపట్టే తత్వం అయ్యుంటుంది. మొదటి నుంచీ ఉన్న ఆ గుణాన్ని మీరిప్పుడు మార్చలేరు. పాప ముందు మీరు బాధపడుతూ కనిపిస్తే తనకి కూడా మానసిక వ్యథ కలిగించినట్లవుతుంది. భార్యాభర్తలు తమ మధ్య జరిగే విషయాలు పిల్లలకు తెలియకుండా నడచుకోవాలి. మనసులో ఉన్న బాధను మీకు బాగా దగ్గరైనవాళ్లు, ఇంకెవరితోనూ చెప్పరనే నమ్మకం ఉన్న ఒకరిద్దరు బంధుమిత్రులతో పంచుకోండి. మీ భర్త గురించి ఫిర్యాదు చేస్తున్నట్టో, తప్పుపడుతున్నట్టో కాకుండా మీరెంత ఆవేదన చెందుతున్నదీ అర్థమయ్యేలా చెప్పండి. ఆ వ్యక్తులు పరిపక్వంగా ఆలోచించేవాళ్లు, తొందరపాటు లేనివాళ్లు అయ్యుండాలి. వారి సలహాలూ, ఊరడింపు మాటలతో మీకు సాంత్వన కలుగుతుంది. అలాగే డిప్రెషన్‌గా అనిపించినప్పుడు దిగులుపడుతూ కూర్చోక ఆ సమయంలో మీకు ఇష్టమైన వ్యాపకాలను కల్పించుకోండి. బొమ్మలేయడం, కవితలు రాయడం, పాటలు పాడటం, వినడం, మంచి పుస్తకాలు చదవడం, స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలు చూడటం లాంటివి మీ దుఃఖాన్ని తగ్గించి ఆనందాన్నిస్తాయి. వ్యాయామం లాంటివి కూడా మనసును మళ్లించి, ఊరటనిస్తాయి. వీలైనప్పుడు అనాథ లేదా వృద్ధాశ్రమాలకు వెళ్లండి. మీకంటే కష్టాల్లో ఉన్నవాళ్లతో గడపటం వల్ల మీ సమస్య చిన్నగా అనిపిస్తుంది. అతని తత్వాన్ని ఎటూ మార్చలేరని అర్థమైంది కనుక దాని గురించి పదే పదే ఆలోచించి ఆందోళన చెందొద్దు. మీకు సంతోషం కలిగించే వ్యాపకాలతో గడపండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్