కైరా.. మాయా సుందరి!

ఆమె ఓ ఇన్‌ఫ్లుయెన్సర్‌.. చూస్తున్నారుగా ... చాలా అందంగా ఉంటుంది. ఇన్‌స్టగ్రామ్‌లో జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్ల ఉత్పత్తుల పరిచయం, తన దినచర్య... అప్పుడప్పుడూ అభిమానులతో చాటింగ్‌ వంటివీ చేస్తుంటుంది. దీనిలో గొప్పేముంది అంటారా?

Updated : 07 Jun 2022 12:54 IST

ఆమె ఓ ఇన్‌ఫ్లుయెన్సర్‌.. చూస్తున్నారుగా ... చాలా అందంగా ఉంటుంది. ఇన్‌స్టగ్రామ్‌లో జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్ల ఉత్పత్తుల పరిచయం, తన దినచర్య... అప్పుడప్పుడూ అభిమానులతో చాటింగ్‌ వంటివీ చేస్తుంటుంది. దీనిలో గొప్పేముంది అంటారా? ఆమె ఇన్‌స్టాలోకొచ్చి నాలుగు నెలలే! అనుసరించే వారి సంఖ్య దాదాపు లక్ష! అసలు విషయం ఏంటంటే... తను మనిషే కాదు!!

ర్చువల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌.. మనకు కొత్త కానీ.. ఈ ట్రెండ్‌ విదేశాల్లో ఇప్పటికే మొదలైంది. ఊహాజనిత పాత్రలు.. కార్టూన్‌ క్యారెక్టర్లు ఎలాగో.. వీళ్లూ అంతే! కాకపోతే అచ్చంగా మనుషుల్ని పోలే ఉంటారు. నడక, వస్త్రధారణ మనలాగే ఉంటాయి. తమ దినచర్య, సంస్థల వ్యాపార ప్రకటనలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటుంటారు. పోస్టులు చూస్తే నిజమైన మనుషులే అనుకుంటాం. ఈ అమ్మాయీ అంతే. పేరు కైరా. మన దేశంలో తొలి వర్చువల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌. హిమాన్షు గోయల్‌ అనే వ్యక్తి రూపొందించాడు. ఈ జనవరి 28న ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టింది. ఈమెను పూర్తిగా వ్యాపార ఆలోచనతోనే రూపొందించారు. తన పేరుతో ఫొటోలు, వీడియోలు పెట్టడానికి ప్రత్యేక బృందం ఉంటుంది. ఇప్పటి వరకూ పెట్టింది 21 పోస్టులే అయినా రోజుకు కనీసం వెయ్యి మంది కొత్త ఫాలోయర్లు చేరుతున్నారట. ‘బ్రాండ్ల ప్రచారంలో భాగంగా ప్రకటనలు తప్పనిసరి. వాటిని చిత్రీకరించడానికి దూర ప్రాంతాలకు వెళ్లాల్సొస్తుంది. ప్రయాణాలు, దుస్తులు, ఆహారం వగైరా అంతా ఖర్చు. ఇక్కడ ఆ ప్రాంతం ఫొటోకి 3డి సాయంతో ఈమెను జతచేస్తాం. వీళ్లకు వయసు పెరుగదు. పైగా వివాదాలకీ తావుండదు’ అని చెబుతున్నారు రూపకర్తలు. అలాంటివి ఏమైనా పొరబాటున ఎదురైనా సంస్థ నిపుణులే చూసుకుంటారు. పోస్టుల్లోని వీడియోలూ, చాటింగుల్లో గలగలా మాట్లాడేస్తోంటే.. చాలామంది నిజమైన అమ్మాయే అనుకుని మెసేజ్‌లూ పెడుతుంటారు. ఇటీవలే నిజాన్ని బయటపెట్టారు రూపకర్తలు. మాట్లాడటం వరకూ సరే కానీ... ప్రేమలో మాత్రం పడకండని సలహానిస్తున్నారు. చూసుకోండి మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్