విరామంతో కొత్త శక్తి..

పరిపూర్ణ ఆరోగ్యం సాధించాలనుకునే వాళ్లకి విరామం ముఖ్యం అంటున్నారు నిపుణులు. దీంతో శారీరకంగానే కాదు మానసికంగా నూతనోత్తేజం వస్తుందంటున్నారు. అందుకేం చేయాలంటే...

Published : 08 Jun 2022 01:02 IST

పరిపూర్ణ ఆరోగ్యం సాధించాలనుకునే వాళ్లకి విరామం ముఖ్యం అంటున్నారు నిపుణులు. దీంతో శారీరకంగానే కాదు మానసికంగా నూతనోత్తేజం వస్తుందంటున్నారు. అందుకేం చేయాలంటే...

పొద్దున్న లేస్తే.. ఇల్లు, పిల్లలు, ఆఫీసు... ఇన్ని పనుల మధ్య విరామం దొరకడం కష్టమే. అయితే ఈ పనుల్ని మరింత ప్రభావవంతంగా, సృజనాత్మకంగా, సంతోషంగా చేయాలంటే విరామం అవసరం. విశ్రాంతి అంటే నిద్ర సమయమే అనుకుంటారు చాలామంది. అది మాత్రమే కాదు పని, ఆలోచనలు, వ్యాయామం, భావోద్వేగాలు.. వీటన్నింటినుంచీ విరామం ఉండాలి.

* దీని కోసం ప్రకృతిని ఆశ్రయించండి. ఒక పార్కులోనో లేదంటే సరస్సు, సముద్ర తీరాన నడిచి చూడండి.

* మీకు సరదానిచ్చే, మీరెంతో ఇష్టపడే హాబీకి కొంత సమయం కేటాయించండి. ఇందులో ఒక రకమైన ఆనందం ఉంటుంది. అది మీ సృజనాత్మకతను పెంచుతుంది. లేదంటే మ్యూజియాలకు వెళ్లి వేరొకరి సృజనాత్మకను పరిశీలించండి. అది స్ఫూర్తినీ కలిగిస్తుంది.

* ఏవైనా రెండు పనుల మధ్య కొద్ది సేపు విరామం ఉండేలా చూసుకోండి.

* వీలున్నప్పుడల్లా మీ ఫోన్‌, ల్యాప్‌టాప్‌లకు దూరంగా ఉండండి.

* ఇష్టంలేని పార్టీలకు వెళ్లకండి. ఆ సమయం మీకు ఇష్టమైన పనులకి కేటాయించుకుని రీఛార్జ్‌ అవ్వండి.

* ఆర్థిక ప్రయోజనంకంటే మానసికంగా సంతృప్తినిచ్చేలా ఏదైనా సామాజిక కార్యక్రమంలో వాలంటీరుగా పనిచేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని