గుర్తింపు, ప్రశంస కావాలిగా!

థింక్‌ టాంక్‌ సంస్థలో ఆర్థిక విభాగంలో రిసెర్చ్‌ అసిస్టెంట్‌ని. ఎంత కష్టపడినా నా పనికి గుర్తింపు, ప్రశంసలుండవు. మా బాస్‌ చిన్న తప్పునూ పట్టుకుని, ఇంకెలా చేయొచ్చో చెబుతుంటుంది. నా సహోద్యోగి విషయంలో మాత్రం చిన్నదానికీ ప్రశంసిస్తుంది. ఈ అయిదేళ్లలో

Updated : 29 Feb 2024 18:52 IST

థింక్‌ టాంక్‌ సంస్థలో ఆర్థిక విభాగంలో రిసెర్చ్‌ అసిస్టెంట్‌ని. ఎంత కష్టపడినా నా పనికి గుర్తింపు, ప్రశంసలుండవు. మా బాస్‌ చిన్న తప్పునూ పట్టుకుని, ఇంకెలా చేయొచ్చో చెబుతుంటుంది. నా సహోద్యోగి విషయంలో మాత్రం చిన్నదానికీ ప్రశంసిస్తుంది. ఈ అయిదేళ్లలో జీతం పెంచమని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదు. నా పని బాగా చేస్తున్నా. సంతృప్త్తీ ఉంది. బాస్‌ కూడా దాన్ని గుర్తించాలి, నిజాయతీతో కూడిన ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వాలని కోరుకుంటున్నా. మీరేమంటారు?

- ఓ సోదరి

మీరు చెప్పినదాని ప్రకారం మీ కష్టాన్ని మీ బాస్‌ వేరే కోణంలో చూస్తున్నట్లున్నారు. ఇతరుల పనిని ప్రశంసిస్తున్నారు కాబట్టి, పొగడ్తలు, ఫీడ్‌బ్యాక్‌ వంటి వాటికి దూరమని చెప్పలేం. ఈ అయిదేళ్లలో మీ పని ఆకట్టుకోకపోయినా, ఒక్కటైనా ప్రశంసించేలా ఉండదా? మీరు  ఉద్యోగం పట్ల సంతృప్తితో ఉన్నా... నా సలహా మాత్రం వేరే విభాగానికో లేదా ఉద్యోగానికో మారమనే! ఇన్నేళ్లలో ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదంటే కావాలనే పట్టించుకోవడం లేదని అర్థం. ఆఫీసుల్లో మన పురోగతి పై వారి మీదే ఆధారపడి ఉంటుంది. వాళ్లు మనపై తెలిపే అభిప్రాయం ఆధారంగానే జీతంలో పెరుగుదల, పదోన్నతి వంటివి వస్తాయి. ఎవరైనా బలవంతంగా చెప్పించాలని చూసినా ఆవిడ మీ పని పట్ల సంతృప్తిగా లేననే చెప్పొచ్చు. కాబట్టి, వేరే ఉద్యోగం లేదా విభాగంపై దృష్టిపెట్టండి. ఇలాగే కొనసాగితే మీ కెరియర్‌పైనే కాదు.. మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుంది. లేదూ పరిష్కరించుకుంటాను అంటారా! మీ బాస్‌ను కలిసి ‘నా పని ఎలా ఉంది? మిగతా వారితో పోలిస్తే ఇలా చేశాను. వీటిని సాధించాను’ అని చెబుతూనే ‘ప్రమోషన్‌/ హైక్‌లో నా పేరు ఎందుకు లేదో తెలుసుకోవచ్చా?’ అనడగండి. అప్పటికీ పైపైన సమాధానమే వస్తే.. ‘నేర్చుకోవడానికీ, నన్ను నేను మార్చుకోవడానికీ నేనెప్పుడూ సిద్ధమే! దానికి తగ్గట్టుగా పని బాగా చేసినప్పుడు సానుకూల ఫీడ్‌బ్యాక్‌నీ ఆశిస్తాను. ఇది అందరూ కోరుకునేదే కాదంటారా’ అనడగండి. ఇదంతా ఆమె తీరును గుర్తు చేయడంలో భాగమే. అప్పటికీ ఆమె తీరు మారలేదంటే.. మీరు మారాల్సిన సమయం వచ్చిందని అర్థం. ధైర్యంగా ప్రయత్నించండి. మీ కష్టానికి తగిన గుర్తింపు తప్పక అందుకుంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్